: వీధి బాలలు;-రాధ కుసుమ;-కలం స్నేహం
బురదలో పుట్టిన తామరలు
ఐనా స్వచ్ఛమైన చిరునవ్వుల దీపాలు
కన్నవారు కరువై
చేరదీసేవారు లేని శాపగ్రస్థులు
వారే వీధి బాలలు...!

చెత్తకుప్పల చుట్టూ తిరుగుతూ
నేల తల్లిని ఒడిగా చేసుకుని
ఆకాశ నీడలో
చంద్రుని వెన్నెల కిరణాలను
దుప్పటి గా కప్పుకుని
నిదురించే  చిన్నారులు...!

ఇంటిని వదిలారో
దూరంగా విసిరివేయబడ్డారో
నిత్యం కన్నీటి కడవలైన
నేత్రాలు
కదిలిస్తె ప్రతి హృది నిండా
అశృవుల గాథలు

కొందరు పుణ్యాత్ములు
వీరికి ఇచ్చిన నీడలో
చేర్చిన చదువుల గుడిలో
విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న సుమపరిమళాలు
వారిని చూస్తె మమకారం ఏరులై పారుతుంది
మాటల్లో కాఠిన్యం ఉన్నా
మనసు తేనెల తియ్యదనం
వారిపట్ల అనురాగం
చూపుదాం
కనికరంగా మెలుగుదాం...!


కామెంట్‌లు