బ్రతుకుబాట ..!> అంతరాయం; -కోరాడ.నరసింహరావు >విశాఖపట్నం

 అప్పటికే క్లాసులు ప్రారంభమై ఆరునెలలు గడిచిపోయాయి !
7వ తరగతిలో అయిపోయిన పాఠాల్లో ని ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటే.. నేను తెల్లముఖం వేసుకుని చూసే వాడిని ! మాకు  బంటుపిల్లి రాజారావు మాష్టారని... తెలుగు చెప్పేవారు... నాబుర్ర ఒకోమారు పాదరసంలా పని చేసేది... మరోమారు అంతా మరిచిపోయి అయోమయమై పోయేది !!
ఓ రోజు ఓ తెలుగుపద్యం నన్ను
చెప్పమన్నారు...నేను చెప్పటం 
మొదలు పెట్టాను... పద్యం మధ్యలో ఓ పదం ఉచ్చరించ టం లో... బూతు ధ్వనించింది 
అది తలచుకుని కిసుక్కున నవ్వాను! మళ్ళీచెప్పుఅన్నారు
మాష్టారు...మళ్ళీసరిగ్గాఅక్కడికి  వచ్చేసరికి...మళ్ళీ నవ్వాను 
మళ్ళీ చెప్పుఅన్నారు...మూడో 
మారు... అప్పుడూ అదే పరిస్థితి !!
మాష్టారి చేతిలోబొటనవేలంత వలమున్న బెత్తంఉంది...అతని 
కోపానికి ఆబెత్తం మొత్తం తుక్కు
తుక్కు అయిపోయి నావొళ్ళం తా...తట్లు తేరిపోయాయి !ఆ 
క్లాస్ అయిపోయిఅతనువెళ్లిపో యిన తరువాత   పిల్లలంతా నాచుట్టూ చేరి మాష్టారిని తిట్టుకున్నారు...తప్పు  నాదే నురా...పదే పదే అవకాశ మిచ్చినా...తప్పును నేనే సవరించుకోలేక పోయాను ఆయన్ని తిట్టకండి అని నేను త్రికరణ శుద్దితోనే అన్నాను !
అప్పుడు గాని., ఇన్కెప్పుడుగానీ 
అతనిమీద ప్రేమే గానీ నాకు ద్వేషం కలగలేదు !!
    నా దురద్రుష్టం 'భాషా' తో ఏ అభిప్రాయబేధం వచ్చిందో జ్ఞాపకం లేదు గానీ... మేమిద్దరం మాట్లాడుకోటం మానేసాం... మమ్మల్ని గమనించిన మాక్లాసు మేట్స్ 
బెలగాం విఠలేశ్వర్ రావు, బాసూరి శివరామకృష్ణ మరో ఇద్దరు పేర్లు జ్ఞాపకం లేదు... 
మాయిద్దర్నీ కలపటానికి శత విధాల ప్రయత్నించారు బలవంతముగా అటిద్దరు...
ఇటిద్దరు  మాయిద్దర్నీ పట్టుకుని బలవంతంగా చేతులు కలిపే ప్రయత్నం చేశారు... ! మేము మంకు పట్లు 
వీడలేదు... ఆఖరికి... మిమ్మల్ని కలపటం ఆ దేవుడి తరంకూడా కాదురా బాబు మీరిద్దరూ "ఇండియా- 
పాకిస్థాన్లు "అని వదిలేశారు !!
ఆమాట అప్పట్లో అర్ధం కాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటే... 
అబ్బ..ఎంతగొప్పగా సరిపోల్చా రు అనిపిస్తుంటుంది !
భాషా.. క్లాసులో మొదటిరెండు బెంచీల్లో కూచుని శ్రద్దగా చదివే వాడు ! నేను మాత్రం... శివరామకృష్ణ, విఠలేశ్వర రావు 
మరోఇద్దరి తో కలిసి... ఆఖరి బెంచీ లోకూచుని మాష్టార్లకు కనిపించకుండా...పనికిమాలిన 
కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళం !పాఠాలసులు వినేవాళ్ళం కాదు !
ఐతే.. తరువాతి కాలంలో... 
విఠలేశ్వర్... ఫుడ్ కార్పొరేషన్ లో...శివరామకృష్ణ బ్యాంకు లో 
ఉద్యోగస్తులైపోయారు... భాషా 
మాత్రం మంచి మార్కులతో పాసయి... టైపు, షార్ట్ హ్యాండ్ పరీక్షలు కూడా పాసయీ.... 
ఉద్యోగస్తుడు కాలేకపోయాడు 
మసీదులో గురువుగా ట్రైనింగ్ అయి... కబేళా లో మేకలకు, గొ ర్రె  లకి... పీకలు కోసే పని చేసుకుంటున్నాడు !!అది ట్విస్టు !!
ఇంక నావిషయానికొస్తే... 
మా అమ్మ... గొప్పోళ్ళఇంట్లో  అంట్లు తోమినా....షోడా షాప్ లకు బిoదెలతో నీళ్లు మోసినా 
నేను నా చదువుకు ఫుల్ స్టాఫ్
పెట్టక తప్పలేదు !
8 వ తరగతి మధ్యలోనే మళ్ళీ 
చదువు ఆగిపోయింది.... !!
              ******************
                  ... సశేషం....
కామెంట్‌లు