పంచెకట్టు ! సంప్రదాయం పట్టు!;-విజయ రామగిరి;-కలంస్నేహం
సంప్రదాయ కట్టులోన పెళ్లికొడుకు వలే..
ఆరుగజాల పంచెలోన అరవింద నేత్రుడు..
వధువును కోరవచ్చిన నవ మన్మధుడు..
తిరుపతి వెంకన్న వలే ఠీవి ఒలకబోస్తూ...
పంచె కట్టిన పురుషుడు పులివలే ఉన్నాడు..

ఆకట్టుకునే సంస్కారం అణువణువునా నింపుకుని..
చూపరులను కట్టేసే పురుషోత్తముడు...
చేతి కడియాలతో చిరునవ్వులొలుకుతూ..
భుజం మీద కండువా భూషణాలంకారం..
భువినేలే ఇంద్రుని భాగ్యమిదిలే...

ఉత్తరదేశపు కట్టులోన ఉత్తమ వరుడు...
దక్షిణ దిశ కట్టును కలిపి కట్టిన తీరు...
చీరనైనా ధోవతిలా మలచిన వన్నెలొలుకు..

శుభ వేళల సంప్రదాయమే ముఖ్యమని..
వస్తధారణతోనే హుందానొలకబోస్తూ చెప్పవచ్చు..
దిక్కులు వేరైనా మనమంతా దివ్య భారతీయమని..


కామెంట్‌లు