దీపావళి;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 దీపావళి దీపావళి దీపావళి
అందమైన దీపాల దీపావళి
!! దీపావళి!!
పొద్దు పొద్దున్నే మనమూ లేద్దామా
తలంటి స్నానాలు చేద్దామా
కొత్తబట్టలు తొడిగి ఆడుదామా
సేమియా పాయసం తిందామా
!! దీపావళి!!
అబ్బబ్బో టపాకాయలెంతబాగున్నాయ్
ఎన్నెన్నో రంగుల్లో మురిపిస్తున్నాయ్
భూమి మీద భూచక్రం తిరుగుతోంది
విష్ణుచక్రం నాచేతిలో తిరుగుతోంది
!! దీపావళి!!
చిచ్చుబుడ్డి వెలుగులను పంచుతోంది
రాకెట్టు నింగికేసి సాగుతోంది
ధన్ ధన్ తుస్ తుస్ ఢాం ఢాం ఆటంబాంబులు
అందరినీ ఎంతో భయపెడుతున్నాయి
!! దీపావళి!!
పిల్లలను పెద్దలను మురిపిస్తోంది
అందరికీ బాధలన్ని మరిపిస్తోంది
దీపావళి ఎంతో బాగుంది
మన అందరికీ ఆనందం పంచుతోంది
!! దీపావళి!!

కామెంట్‌లు