కార్తీక దామోదరుడు;-డా. కమలా దేవి-కలం స్నేహం
 గగనవీథిని శరత్చంద్రికలువెల్లి
విరిసె
కార్తీక దీపాల వెలుగులలో
ఏతెంచాడుకార్తీక దామోదరుడు
తులసిదామము ఉదరమున
కలవాడై
యశోదమ్మ ప్రేమదామముచె
కట్టబడి చిందిస్తున్నాడు చిరు నవ్వులను
నీలినీలి మేఘాలతో పోటీపడుతూ
నీలమేఘశ్యాముడై చేస్తున్నాడు కనువిందు
దేహఛాయతోపోటీపడుతోంది
నెమలిపింఛము శిరమున
చేరింది గోపాలుని చుట్టు
గోగణము
తమతల్లులపొదుగులుచేరే
గోవత్సాలు పాలుతాగడంఆపి
తిలకిస్తున్నాయి నిశ్చేష్టతతొ గోవిందునిసొగసులను
పరవశిస్తోంది ప్రకృతియావత్తు
ముగ్థమోహనునిమురళీరవానికి
చంచలనేత్రాలతో చెవులు రిక్కించి చూస్తున్నాయి మోరలు ఎత్తి కురంగాలు
ప్రదర్శిస్తున్నాయి నాట్యవిన్యా
సాలు మయూరాలు ఆనందంతో
కిలకిలారావాలతో తమ హర్షాన్ని ప్రకటిస్తోంది పక్షి సంతతి
కంటికి కాటుక, కాళ్లకు పారాణి
అందెలరవళులు సందడిచేయ
మురళిగాన పరవశయై
ఏతెంచె రాధ
కార్తీక పూజలందుకొన విచ్చేసిన
ఆదామోదరుని కరుణాకటాక్ష
వీక్షణములు మనపై ప్రసరించుగాక.

కామెంట్‌లు