* సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
 *కష్టాలు*
***************
*కష్టాలు రాని మనుషులంటూ ఉండరు*
*ఎవరికైనా కష్టాలు వస్తూనే ఉంటాయి.*
*అలాంటప్పుడే మనిషి చెట్టులా తట్టుకునే వాడా,తాలుగింజలా బేలగా కొట్టుకు పోయేవాడా తెలుస్తుంది*.
*అప్పుడప్పుడు ఎదురయ్యే కష్టాలు మన మనో స్థైర్యం ఎంతుందో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలని భావించాలి.*
*అప్పుడే కష్టాలు బరువుగా కాకుండా తేలిపోయే దూదిపింజల్లా అనిపిస్తాయి*.
*సుప్రభాత కిరణాల నమస్సులతో 🙏*

కామెంట్‌లు