లింగార్జునాలు - బాలగేయం ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
రంగు రంగుల పూలు 
రమణీయమగు పూలు 
లింగార్జునాలివే 
సున్నితపు కుసుమాలు!

శిశిరాన అందాలు 
కన్నులకు బంధాలు 
తోటలో మనోహరo 
కుండీలో వయ్యారాలు!

పూల వాడిన కాయ 
కాయలో గింజలును 
ఎండించి వెదజల్లు 
హృదయమున విరి జల్లు!

కార్తీక శోభలివి 
పూజలో పావనము 
మృదువైన రేకులతో 
మది దోచు దృశ్యాలు!!


కామెంట్‌లు