*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - 13*
 *బిల్వపత్రము - సర్వ భగవత్ తత్వ మయము.  బిల్వ పత్రం - మూలంలో జనార్ధనుడు, మధ్యలో బ్రహ్మ, చివరలో రుద్రుడు, ఆకు పైన సర్వ దేవతలు కొలువై వుంటారు. బిల్వ పత్రం నందు, సత్త్వరజస్తమములు అనే త్రిగుణములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనబడే త్రిమూర్తులు, ప్రకృతి, జీవ, పరమాత్మలు అనబడే త్రి తత్వములు సరిసమానముగా వున్నాయి.*
*"వనస్పతి స్తవ వృక్షోథ బిల్వః"*
*బిల్వ వృక్షాన్ని - శ్రీ వృక్షము అంటారు.*
*బిల్వపత్రాన్ని చూడటం వల్ల, ముట్టుకోవడం వల్ల, వాసన చూడటం వల్ల దుఃఖము, ఆశ, దారిద్ర్యం, అపమృత్యువు, పేదరికం నశించి పోతాయి.  గుండెజబ్బులకు, శరీర పుష్టికి బిల్వం ఎదురేలేని మూలిక.*  
*"ఏక బిల్వం శివార్పణం" అంటూ శివునిపూజ చేస్తే పరశివుడు పరమ సంతుష్టుడు అవుతాడు.*
*ఏక బిల్వం శివార్పణం*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు