*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - 16*
 *శివపురాణం అన్ని శాస్త్రముల సిద్ధాంతాలతో సంపన్నమైనది. వినేవారి చెవులకు దివ్యమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందరికీ మంచి చేస్తుంది. పరమశివుడే చెప్పిన శివపురాణం. దీని మహిమలు చెప్పడం ఎవరి వల్లనైనా అవుతుందా. అంతా కాల మహిమ అంటారు కదా! ఆ కాల మహిమనుండి మనలను కాపాడే ఉత్తమ సాధనము ఈ శివపురాణము.*
*ఈ శివపురాణము వలన కలియుగంలో మానవులకు ఎంతో మంచి చేకూరుతుంది. ఈ పురాణము ఉత్తమమైన శాస్త్రము.*
*ఈ శివ పురాణము, మన భూమి మీద దేవదేవుడగు మహాశివుని వాజ్ఞ్మయ రూపంగా తలచి, పూజించి, చదువుకోవాలి.  దీనిని చదవడం వలన, వినడం వలన మానవులు శివభక్తిని పొంది శివపదమును పొందుతారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు