క్రమశిక్షణ;-కనుమ ఎల్లారెడ్డి పౌరశాస్త్ర అధ్యాపకులుతాడిపత్రి 93915 23027.

 పల్లవి,ప్రవీణ్ ఇద్దరూ ఒకే తరగతి.పల్లవి తల్లిదండ్రులు చెప్పినట్లు విని చక్కగా చదువుకునేది.మంచి మార్కులు తెచ్చుకునేది.తమ్ముడు ప్రవీణ్ కు ప్రతి సబ్జెక్టులో ను అరకొర మార్క్ లే వచ్చేవి.ప్రవీణ్ ఎప్పుడూ సెల్ ఫోన్ చూస్తూ,గేమ్స్ ఆడుకుంటూ రాత్రి ఎప్పుడో నిద్ర పోయే వాడు.సెల్ తీసుకుంటే వాడు ఎక్కడ ఏమి చేసుకుంటాడోనని తల్లిదండ్రులు ఆందోళన. అందుకే వాళ్ళు స్కూళ్లలో కూడా టీచర్లకు ఏ ఫిర్యాదు చేయలేదు.తమ్ముడిని మాటల ద్వారానే మార్చాలి అనుకుంది పల్లవి.ఆ రోజు క్లాసులో అందరూ" అక్కేమో ఫస్ట్, తమ్ముడేమో లాస్ట్ " అని గెలి చేస్తుంటే బాధపడింది పల్లవి. ఈ విషయమే తమ్ముడితో అనింది.తమ్ముడు బాధపడుతుంటే " ఎందుకు బాధపడతావ్. నిన్ను అమ్మ,నాన్న కూడా ఏమి అనలేదు కదా! వాడే తెలుసుకుని  మంచి మార్కులు తెచ్చుకుంటాడు లే అని నాన్న అన్నాడు తెలుసా!నీకు ఏదీ తక్కువ కాకుండా ప్రతిదీ సమకూరుస్తున్నారు,తిడితే నువ్వు ఎక్కడ బాధ పడతావోనని వాడికి కూడా మంచి మార్కులే వస్తాయిలే అని అమ్మ నాతో ఎన్నో సార్లు చెప్పింది.నీ పుట్టినరోజు కు అమ్మ,నాన్న ఎంత  హడావుడి చేశారో తెలుసా! నీ ఆనందమే వాళ్ల అనందం. వారు ఆనందంగా ఉండాలంటే నువ్వు  పెందలాడే లేచి ఒక గంట చదువు.సెల్ అలవాటు మానుకో , క్లాస్ లో పాఠాలు బాగా విను.అర్థము కానివి నన్ను అడుగు చెబుతా,తల్లిదండ్రుల మాట విను క్రమశిక్షణ తో నువ్వు అన్నీ పాటిస్తే నీకు మన క్లాసులో అందరికంటే మంచి మార్కులు వస్తాయి తెల్సా!" అంది. ఆ మాటలకు చలించి పోయాడు ప్రవీణ్. " అక్క!"అన్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. పల్లవి వాడి కన్నీళ్లు తుడుస్తూ "ఎడవకు" అంది.  "అక్కా నేను నీ తో పాటే చదువుతా, కష్ట పడతా,అమ్మ,నాన్న కళ్ళలో ఆనందం నింపుతా ఇక ఆ సెల్ ఫోన్ ముట్టుకొను ,దానికి కేటాయించే సమయం చదువుకు కేటాయిస్తాను" అన్నాడు.ఆ మాటకు సంతోషించింది పల్లవి.
        ఆ రోజు పెందలాడే లేచి శ్రద్దగా చదువుకుంటున్నాడు , తల్లితండ్రి చెప్పినట్లే వింటున్నాడు.క్రమశిక్షణ తో అన్ని అలవాట్లు సరి చేసుకున్నాడు.ఆ నెలలో యూనిట్ టెస్ట్ లో అందరికంటే ఫస్టు మార్క్ లు వచ్చాయి.సంతోషం తో పరుగున ఇంటికెళ్లి  "అమ్మ,నాన్న"అంటూ వారి చేతులు పట్టుకుని
"ఈసారి యూనిట్ పరీక్షలు లో నేనే ఫస్ట్ "అంటూ అమ్మను వాటేసుకున్నాడు. తండ్రి ఎత్తుకుని గిరా గిరా  తిప్పాడు. ఆ సంతోషం చూసి కళ్ళలో ఆనందబాష్పాలు జల జల రాలాయి పల్లవికి. "నేను చూడాల్సింది ఇదే థాంక్ గాడ్"అనుకుంది మనసులో.
               ......           .......
                 
కామెంట్‌లు