ఓంశివాయ గురవే నమః! జగన్నాటక సూత్ర ధారి "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 🙏 సూత్ర ధారివి నీవు!
      పాత్ర ధారుల మేము! 
       
      నటరాజ! రవి తేజ!
               ఓ సాంబ దేవ!
   ( సాంబ శివ పదాలు., "శంకర ప్రియ.,")
🔱పరమేశ్వరుడు.. ఒక్కడే! ప్రధాన పురుషుడు! స్థావర జంగమాత్మక మైన, ఈ జగమంతా.. ఒక నాటక రంగస్థలం! దీనికి దర్శకత్వము వహించు వాడు! కనుక, "సూత్ర ధారి".. సాంబ శివుడు! ఈ జగన్నాటకము నందు, జీవుల మైన మనమంతా "పాత్ర ధారులం"!
 🔱శ్రీ మహా దేవుడు, శివుడు... పశు పక్ష్యాది సమస్త ప్రాణి కోటికి అంతర్యామి!ఆట్లే, దేవతలు, దానవులు, మానవులు.. మున్నగు జీవరాశు లందు "చైతన్య శక్తి"గా, వారిని నియమించు వాడే.. పరమేశ్వరుడు!
🔱మహా భారతాంతర్గత మైన.. శ్రీ శివ సహస్రనామ స్తోత్రము నందు... "దేవాసుర మహేశ్వరః" అని;
( 949.వ. నామము నందు ) "శ్రీ శివ పరంబ్రహ్మ తత్వము"ను అభి వర్ణించారు, శ్రీకృష్ణ పరమాత్మ. 
 🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( తేట గీతి పద్యము )
       పాత్ర ధారులమై, కళా క్షేత్రమందు
        అడుగు తడబడ కుండ, మే మభినయింప;
       సూత్ర ధారుడవై, పైన చూచుచున్న,
       ఓ జగన్నాట్య సందర్శకా! జయోస్తు
         ( డాక్టర్. కరుణ శ్రీ., "పరమేశ్వరుడు" శీర్షిక.. అమర్ ఖయాం కావ్యం.,)
   🙏ఓం నమః శివాయ! శివాయ నమః!

కామెంట్‌లు