షటిల్ బ్యాట్మెంటిన్ వచ్చి కనుమరుగయ్యేకదా
బాల్ బ్యాట్మెంటిన్ ఆట మననుండి ఇప్పుడు ....!
షటిల్ ఆట విశ్వవ్యాప్తమయ్యే యువతలో భలేగా,
వినుము కెఎల్వీ.మాట నిజము సుమ్ము.......!!
----------------------------------------------------------------
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకుతెస్తాయి కొన్నిఆటలు
'బాల్ బాడ్మింటిన్ ' మరువరాని ఆట అందులో....!
అర్జున అవార్డుతో కీర్తి తెచ్చెనుకీ.శే.పిచ్చయ్యగారు
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము.....!!
-------------------------------------------------------------------
మనోవర్తికి ఆశపడి మాయలాడి మహిళలెందరో
పుట్టగొడుగులుమాదిరి పుట్టుకొస్తున్న ఘటనలు
పశ్చిమ దేశాలకే పరిమితం కాదు లెమ్ము సోదరా
వినుము కెఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
తెలియక తప్పుచేసినవారిని క్షమియించవచ్చు
తెలిసి తప్పుచేయువాడు శిక్షకుఅర్హుడు సుమా !
నాయకుల విషయమందు ఇదిఎటులభిన్నమో కదా
వినుము కెఎల్వీ.మాట నిజము సుమ్ము......!!
--------------------------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి