భగవాన్ శాంతిని ప్రసాదించు;-" కవి శిరోమణి" - రసస్రవంతి "సాహితీ శిరోమణి" కావ్యసుధ జంట కవులు, - హైదరాబాద్.
  ఆనందం అంటే
 మన జీవితం భగవంతుని
 విశ్వ వీణపు శృతిలయలో
 మమేకం కావడమే
 సర్వదా సంతోషాన్ని పెంచే
 వ్యక్తిని కలుసుకున్నప్పుడు
 మనలోనూ
 నూతన శక్తి వస్తుంది
 మనల్ని మనం
 ఉద్ధరించు కోవడానికి
 ఇతరులను
 ఉద్ధరించడానికి అయితే
 మనకు ఆనందం అవసరం
 మన హృదయాలలో
సంతోషం లేకుండా
ప్రపంచానికి ఎలా సంతోషాన్ని
అంది ఇవ్వగలం మనం ?
మనలో ఒక
సజీవ చైతన్యం ఉంది
ప్రపంచాన్ని చైతన్యముతో
మనం సంబంధం
ఏర్పరచుకున్నప్పుడు
అది సజీవం అయ్యిందని
తెలుసుకుంటాం
శాశ్వతమైన దాన్ని
స్పృశించిన అప్పుడే
మనలో సర్వ  దుఃఖాలు నశిస్తాయి
అందుకే మనం భగవంతుని
ఈ తీరుగా ప్రార్థించాలి
ఉన్నత ప్రేరణ ద్వారా నా ఆలోచనలను వికసింపజేయి 
హృదయ ఆనందాన్ని
నాకు అనుగ్రహించు !
విశ్వ జీవనముతో నా జీవితం
లయబద్ధంగా సాగనీ,
విశ్వ మనసుతో నా మనస్సు
సామరస్యంగా ఆలోచించనీ,
అవిచ్ఛిన్నమైన,
అవి నాశనమైన
 శాంతిని నాకు
 భగవాన్ ప్రసాదించు !!

కామెంట్‌లు