గీతాంజలి --రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 30. " అంతరాత్మ అలజడి - సిగ్గుపడే జీవుడు" 
తనలోకి తాను తొంగి చూసుకొని మొరటుతనం, కాఠిన్యతలతో కూడిన అహంకారాన్ని గుర్తించి తనలోని ఈ రకమైన అంతరాత్మను వెంటబెట్టుకుని ప్రేమ, జాలి, కరుణ వంటి సుగుణాల రాశివైన నీ సన్నిధికి రావాలంటే నాకు సిగ్గుగా వుంది ప్రభూ! అంటూ భగవంతునికి తన దైన్యాన్ని వ్యక్తపరుస్తున్న భక్తుడు. 
‘నేను భగవంతుని దర్శనానికి ఒంటరిగా బయలుదేరాను. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నా వెనుక ఏదో శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి దూరంగా తప్పుకోవాలని నేను ప్రయత్నం చేసినా, అది నాకు సాధ్యం కాదని స్పష్టమైంది. ఆ శబ్దం చేసేవ్యక్తి తన నడకలో డాంబికాన్ని ప్రదర్శిస్తూ చుట్టూ వున్న వాతావరణాన్ని కాలుష్య పరుస్తున్నాడు. నేనేది మాట్లాడినా దానికతడు ప్రతిధ్వని చేస్తున్నాడు. అతడే నాలోని అంతరాత్మ అని తెలుసుకున్నాను. ఇతరులు తనవల్ల నొచ్చుకుంటున్నారనే బిడియం ఏ కోశానా లేని అతడ్ని వెంటబెట్టుకుని నీ సన్నిధికి రావాలంటే నాకు సిగ్గుగా వుంది ప్రభూ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కామెంట్‌లు