దేవగిరిని దేవేంద్రవర్మ పరిపాలించేవాడు. దేవగిరి సంపన్న రాజ్యం.
ఎక్కడ చూసినా నదులు, చెరువులు, కాలువల్లో నీరు ప్రవహిస్తూ పచ్చని
పొలాలు కనిపించేవి. రైతులందరూ స్వేదం చిందించి పంటలు సాగుచేసేవారు. దిగుబడి అయిన
ధాన్యాన్ని రైతులు తమ పొలాల్లోనే ఎండబెట్టుకుని ఇంటికి
తీసుకెళ్లేవారు.
ఆ రాజ్యంలో మంచి భూస్వాములు ఉండడంతో ప్రతి ఏటా
పంటలు సంవృద్ధిగా పండి ఆదాయం బాగా వచ్చేది. ఖజానాకు శిస్తులు సకాలంలో
చెల్లిస్తుండడంతో దేవగిరి ఏ లోటూ రాకుండా ఉండేది. ప్రజలకు ఏ కష్టం
వచ్చినా పరిస్కారానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించేవాడు. దేవేంద్ర
వర్మ.
ఓ సారి రాజ్యంలో వరిధాన్యం బాగా పండింది. అందరూ ఒకే సారి
పండించడంతో ధర తగ్గి డిమాండు పడిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పండించిన పంటను రైతులు తామే తమ ఇళ్లలో అవసరాలకు వినియోగించసాగారు.
మరుసటి ఏడు రైతులు వరిని వదిలి వేరుశనగ , చెరకు పంటలను సాగు
చేశారు. వరి దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు బియ్యం ధరలు అమాంతం
ఆకాశాన్ని అంటింది. సామాన్యులు బియ్యం కొనలేని దుస్థితి ఏర్పడింది. అటు
వర్షాలు లేక చెరువులు, నదులు ఎండిపోయి తాగునీటి కటకట ఏర్పడింది.
కరువు తీవ్ర స్థాయిలో ఉండడంతో రాజు తన మంత్రితో అత్యవసర
సమావేశం ఏర్పాటు చేసి కరువును ఎదుర్కొనే మార్గాలను అన్వేషించాడు.
తక్షణం రాజ్యంలో గంజి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు.
అందుకు ఎంత ధనం అవసరమైనా వెచ్చించాలని మంత్రిని ఆదేశించాడు.
వెంటనే ప్రతి గ్రామంలో ఓ గంజి చలి వేంద్రం వెలసింది. తాత్కాలిక
కుటీరాన్ని నిర్మించాలని రాజు ఆదేశించినా మంత్రి డబ్బు దండగ అని
భావించి కేటాయించిన ధనంలో సగం పైగా కాజేశాడు. అదేమీ తెలియకుండా
రాజుకు మన గంజి చలివేంద్రాలు బ్ర హ్మా డంగా నడుస్తున్నాయి.. ప్రజలు
ఊహించనంతగా తరలి వస్తున్నారు.. . " అని నమ్మించి అసలు సంగతిని దాచి
ఉంచాడు.
కొద్ది రోజులకు దేవగిరిలో ప్రజలు ఆకలితో అలమటిస్తూ పిట్టల్లా
రాలిపోసాగారు. విషయమేమిటో తెలియక దేవేంద్రవర్మ ఆందోళన చెందాడు.
స్వయంగా గంజి చలివేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ ఓ
గ్లాస్ గంజి మాత్రమే ఇస్తున్నారు. సౌకర్యాలు ఏమీలేవు. వెంటనే రాజు
కోపంతో మంత్రిని పిలిచి " ఇదేమిటీ ఇలా చేస్తున్నావు? " అని
ప్రశ్నించాడు.
మంత్రి తగిన సమాధానం చెప్పలేదు. " ప్రభూ ఇప్పుడు నా కుమారుడి
పెళ్లి వుంది.. ఒక్కగా నొక్క కొడుకు .. వాడి పెళ్లి ఘనంగా చేయాలి..
అందరూ మెచ్చాలి.. " అని చెప్పాడు మంత్రి దుర్భుద్ధి. రాజుకు అది
నచ్చలేదు. " మంత్రిగారూ .. కరువు తాండవిస్తూ ప్రజలు కన్నీటిలో మునిగి
తేలుతున్నప్పుడు నువ్వు పెళ్లి వేడుకలు ఘనంగా జరిపి ఆనందంలో తే
లియాడాలనుకోవడం సరికాదు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆ
కోరికను విరమిచుకో.. > అని హెచ్చరించాడు రాజు.
రాజు మాట వినలేదు మంత్రి. తనకు భారీ మొత్తంలో ధనం కావాలని
పట్టుపట్టాడు. అంత లేదని అడిగినo తలో పదో వంతు ఇచ్చాడు రాజు.
మంత్రి ముఖం చిన్నబోయింది. నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయాడు.
మంత్రి కొడుకు పెళ్లి ఘనంగా జరిపాడు. రాజు ప్రజల కష్టాలను
తలుచు కుంటూ వేడుకలకు దూరంగా వుండిపోయాడు. ఇది మంత్రికి నచ్చలేదు.
రాజుపై పగ బట్టాడు. అప్పటినుంచి రాజు అంటే ఎడమొహం పెద మొహంగా
ప్రవర్తించసాగాడు.
మంత్రి వ్యవహారం రాజుకు నచ్చలేదు. వెంటనే ఉ ద్యోగులందరిని
సమావేశపరచి కరువును ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని
అందుకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైతులే దాచుకుని వీలైనప్పుడు
మార్కెట్లో విక్రయించుకునేలా నిల్వ ఉంచుకునేందుకు పెద్ద గోదాములను
ఏర్పాటు చేయాలని తీర్మానించాడు.
ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా గోదాములను ఏర్పాటు చేశాడు.
ఇప్పుడు రైతులు పండించిన పంటలను అందులో దాచుకోసాగారు. దాని
పర్యవేక్షణ బాధ్యతను మంత్రి దుర్బుద్ధి చేపట్టాడు. కొద్దిరోజులకే
రైతులు దాచుకున్న వరిధాన్యం బస్తాలు మాయం కాసాగాయి. రైతులు తమకు
అవసరమైనప్పుడు బస్తాలను తెచ్చుకోవడానికి వెళితే గోదాముల్లో
చెల్లాచెదురైన వరిగింజలు, చిరిగిన బస్తాలు కనిపించేవి. దీంతో రైతులు
తీవ్రంగా నష్ట పోసాగారు. ఇక దాచుకోవాలనుకున్న వరిధాన్యం ఇలా కావడంతో
రైతులు గగ్గోలు పెట్టసాగారు.
రాజు తన ఆలోచన నెరవేరనందుకు నిరుత్సాహ పడ్డాడు. ఆ ఏడాది కూడా
ప్రజలు కరువుతో అల్లాడిపోయారు.
" వరిధాన్యం ఇలా ఎందుకైయింది?" అని మంత్రిని ప్రశ్నించాడు రాజు.
" ప్రభూ.. ఏమి చేయమంటారు.. ఎక్కడ లేని ఎలుకలు వచ్చి వరి
చాన్యాన్ని తిని చిందరవందర చేస్తున్నాయి.. " అని చెప్పడంతో రాజు
నమ్మాడు. ఆ తర్వాత ఎలుకలపై దృష్టి సారించి నిర్మూలించాడు.. అయినా
ధాన్యం తగ్గిపోసాగింది. రైతులు పూర్తిగా నష్ట పోతుండడంతో ఇక లాభం
లేదని నిశ్చయించుకున్నాడు. మళ్లీ మంత్రిని పిలిచి " ఎలుకలన్నింటినీ
నిర్మూలించాను.. అయినా ధాన్యం మాయమవుతోoదేమిటీ?" ప్రశ్నించాడు రాజు.
" ప్రభూ ఆ ఎలుకలు గోదాముల కలుగుల్లో దాక్కుని రాత్రి వేళల్లో
వచ్చి తినేస్తుంటే నన్నేమి చెయ్యమంటారు?" నిర్లక్ష్యంగా సమాధానం
ఇవ్వడంతో మంత్రిపై సందేహం వచ్చింది. రాత్రి వేళల్లో నిఘా వేశాడు.
గోడౌన్లలో చిన్న సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని ధాన్యపు బస్తాలను
బయటకు తరలించడాన్ని చూశాడు రాజు. ఆ సొరంగ మార్గాన్ని పరిశీలించగా
మంత్రి ఇంటికి వెళ్లిoది. ఇది మంత్రి పనే అయివుంటుందని, ఎలుకల
పనికాదని పసిగట్టాడు.
మంత్రిని పిలిచి " ఇలా చేస్తే రైతుల పొట్ట కొట్టినోళ్లము
అవుతాము.. ఇలాంటి అన్యాయపు పనులు మానుకో .. లేదంటే ఉద్వాసన తప్పదు.. "
అని హెచ్చరించాడు.
మంత్రి దుర్బుద్ధి దురాలోచన మానుకోలేదు.. ఈ సారి ఖజానాకు గండి
పడసాగింది. ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమయింది. ఆ ఏడాది సైతం కరువు
తాండవించింది. మళ్లీ ప్రజలకు తాత్కాలిక గంజి చలివేంద్రాలు ఏర్పాటు
చేశాడు. అదే సమయంలో మంత్రి రహస్యంగా తాను అపహరించిన ధాన్యపు
గింజల్ని విక్రయపు కేంద్రాలను ఏర్పాటు చేసి అధిక ధరలకు
విక్రయించసాగాడు. దీంతో అతనికి ప్రజలపై వున్న భక్తి భావం ఏ పాటిదో
అర్ధమయింది. నిజానికి గతంలోనే గంజి చలివేంద్రాలు ఏర్పాటు సమయంలో నిధుల
స్వాహాకు పాల్పడ్డాడు. ఇది తెలిసినా మళ్లీ గోదాముల నిర్వహణ బాధ్యతలు
అప్పగించడం పొరబాటు అని గ్రహించాడు రాజు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా
ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే ప్రమాదం ఉందని పసిగట్టాడు. ఇలా అసమర్ధుడికి బాధ్యతలు ఇవ్వడం వల్లే ప్రజలకు అన్యాయం జరిగిందని తన పాలనపై
అవినీతి మచ్చ పడిందని తెలుసుకున్నాడు. వెంటనే మంత్రి దుర్బుద్ధిని
తొలగించి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డాడనే నెపంతో రాజ్య బహిష్కరణ చేసి
ఆర్ధిక నిర్వహణ బాధ్యతలను స్వయంగా స్వీకరించాడు రాజు. రైతులకు,
ప్రజలకు ప్రయోజనకర పథకాలు అమలు చేస్తూ వారి శ్రేయస్సుకు పాటుపడ్డాడు
దేవగిరి రాజు దేవేంద్రవర్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి