మదిలో మెదిలే చెలి తలపు;-సంధ్యారెడ్డి;-కలం స్నేహం
క్షణమైనా తలవకుండా ఉండలేను
తనువునిండా నిన్ను నింపానని తెలిసాక
తమకము నిండా తపనలెన్నో తెచ్చాను
కంటిపాప నిండా నిన్ను దాచుకున్నాక
ఎదనిండా భావాలెన్నో చేర్చుకున్నాను
మన బంధం లతలా అల్లుకున్నాక
ప్రతి క్షణం పరవశం నీ సమక్షం
నా సర్వం నీకు సమర్పించాక

నీ నుదుటి తిలకపు మెరుపును
వెండి వెన్నెల జాబిలితో పోల్చుకున్నా
కల్మషం లేని నీ నవ్వు నాకే సొంతం అనుకున్నా
కడవరకు నీకై నేను కట్టుబడి ఉన్నా
నా పెదవులు మధువునెంతా అద్దుకున్నా
నీ అధరపు ముద్దే తీపి నాకు
కన్నులలోని కలలతో ఊసులంపుతున్నా
కంటి పాపనే పాన్పునై నీకు జోలపాడుతుందని

కడలి తీరం దాటి నిన్ను చేరాలని
కెరటంతో ఉప్పెనై ఎగిసిపడుతున్నా
నా సమస్తం నీకని తెలిపాక
ఎందాక నాకు ఈ ఒంటరితనం
అస్తిత్వపు ఆలోచనలే నా మస్తిస్కం నిండా
అహంకారం వీడు అది అలంకారమే నీకు
నేను వేచిన సమయం నీ
వలపులే జ్ఞాపకం
నువ్వు వచ్చేవరకు నాకు చిత్రవధే అనుక్షణం..!!

కామెంట్‌లు