ఐశ్వర్యం;-: సుధ;-కలంస్నేహం
వేలసొమ్ములు కూడబెట్టి
అంతస్తులమేడలు  కట్టి
డాబు దర్పం 
ప్రదర్శించడం ఐశ్వర్యమా...కాదుగా

మన అవసరాలకు
తగిన ధనంతో
ఉన్నంతలో ఎదిగిఒదిగి
సంతృప్తిగా సాగుతూ
నిండైన ఆరోగ్యంతో
మంచి ఆలోచనలతో
మంచితనానికి మారుపేరుగా
మసలడమే ఐశ్వర్యం

కన్నవారి బాగోగులు
పట్టించుకోవడం
మమతానుబంధాల 
నడుమ గడపడం
సమాజహితం కోరడం 
నిజమైన ఐశ్వర్యం

కామెంట్‌లు
Sridhar Akkineni - ( He )Artiste' చెప్పారు…
' ఇంత మంచి పోస్ట్ చడవడం కూడా ఐశ్వర్యమే.'
అభినందనలు.