రాణీరుద్రమ;-మాధవి ఆలువాల;-కలం స్నేహం
 పధ్నాలుగవ ఏటనే పాలనా పగ్గాలు చేపట్టి అసమాన ప్రతిభా పరాక్రమ శీలగా పేరుగన్న కాకతీయ సామ్రాజ్యాధినేత్రి పౌరుష లక్షణాలతో
సూర్య తేజ భాసమానయై.....

 యుద్ధ రంగాన దేవగిరి యాదవ మహాదేవునితో పోరు సలుపు సమయాన నిప్పులు కక్కే
ప్రచండ మార్తాండుని జ్వాలాతోరణమై...

 రణభూమిలో అపర భద్రకాళి అవతారమెత్తి అంబదేవుని చావుదెబ్బ కొట్టుటకు
భూనభోంతరాలు దద్దరిల్లే పోరాటం సలిపిన సమర్ధురాలై.....

 ఇటలీ రాయబారి మార్కోపోలో చే
కొండలు పిండి చేసే ప్రముఖులనెందరినో నాయకులుగా కలిగి శక్తివంతమైన సైనిక కేంద్రంగా అభివర్ణింపబడిన పాలనా దక్షత కలిగిన చక్రవర్తియై....

 వేలాది ఎకరాలకు సాగునీరు తాగునీటికి కొరత లేకుండా తవ్వించిన సముద్రాలను తలదన్నే ఆకాశానికి పోటెత్తిన ఉత్తుంగ తరంగాల  రామప్ప పాకాల చెరువుల నిర్మాతగా ప్రజా సేవలో తరించినదై....

 స్త్రీ అంటే అబల కాదుసబలయనీ అప్రతిహత పాలనాధురీణయనీ... తెలుగువారి చరిత్ర గ్రంథాలలో  సువర్ణాక్షరాలతో లిఖించబడి తెలుగు తల్లి కీర్తి కిరీటాన్ని అలంకరించిన వజ్ర సదృశ 
రాణి రుద్రమదేవి.


కామెంట్‌లు