ప్రియుని రాకతో ;-అరుణ కుమారి;-కలం స్నేహం
మనసు గాలిలో తేలినట్టుంది 
దూది పింజలా తేలికైనట్టుంది 
రాడనుకున్న విభుడు
వచ్చినట్టుంది

వినరే చెలులారా ఈ వింతేమో 
చేదు తిన్నా తియ్యగానే ఉందేమో
వేడి గాలీ చల్లగా తాకుతున్నదే మో

విరహానికి తెరపడిందిగా
కౌగిట్లో గుబులు తీరిందిగా
ముద్దులతో ముచ్చటాయెగా


చలిరోజులు వేధించవులే
చిలిపి పనులకు లోటులేదులే
కబుర్లకు సమయం చాలదులే 

సర్దుకుపోతేనే ఆనందం
కలిసిన మనసులే సంతోషం
ఉందాములే సుఖంగా జీవితాంతం 

కామెంట్‌లు