....... విషయాలెప్పుడూ కవిత్వాలు కాలేవు.... !
విషయాలను కవిత్వంగా మలిచేవి విధానాలే... !!
ఒకే విధానంలో కాస్తంత విసుగు, విరక్తి కలగటం సహజమే కదా... !
అందుకే, కవిత్వం ఎప్పటి
కప్పుడు తన విధానాన్ని మార్చుకుంటూ... నూతన పోకడలతో వినూత్నం గా ముస్తాబు చేసుకుని... ముందుకొస్తూనేవుంది.... !
శబ్దాలంకారాలు, అర్ధాలంకా రాలు... ఆద్యంత ప్రాసలు...
వ్యంగ్యోక్తులు...ప్రతీకాత్మక ధోరణులు...అందమైన పదబంధాలు....ఇవీ... ఇవే
కవిత్వానికి ప్రధానమైన పంచ ప్రాణాలు... !ఇవన్నీ ఎన్నున్నా
ఆ మహానుభావుడన్నట్టు...
కదిలేది... కదిలించేదీ... పెనునిద్దర వదిలించేదే కవిత్వం
చైతన్యంతో ముందుకు నడిపించేది కవిత్వం... !
ప్రతీకలంటే.... చదవగానే చమక్కున మెరిసి... చురుక్కు మనిపించేలా ఉండాలే కానీ...
దేనికేది ప్రతీక, ఈ పదానికర్ధ మేమిటి - ఆపడానికర్ధమేమిటి
ఈ రెండింటికీ మధ్య సంబంధ సారూప్యాలేమిటి... కవి అంత రంగమేమిటి...ఏం చెప్పదలచు కున్నారు...అర్ధం కాక బుర్రలు బద్దలుకొట్టుకుని...పొంతన కుదరని... ఆకవి విశ్లేషణను
ఆత్మ సాక్షిగా అంగీకరించ లేకపోయినా... అబ్బా... ఈ కవిత్వం లో... ఇంతుందా మీరు నిజంగా గొప్ప కవండీ అని పొగుడుతూ ఉంటే....
నివ్వెరపోయి చూస్తోంది... కవిత్వం... !!
******
. ..... కోరాడ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి