ఆశించడం, అన్వేషించడం,
అందినంత ఆర్జించడమే
మనిషి బ్రతుకు లక్ష్యమైతే,
ఆదరించే మనసులు కరువై
బ్రతుకుబాట బరువై
అల్లాడిపోయే అభాగ్యులతో లోకమే అస్తవ్యస్తం!!
ఆశించడం మనిషి లక్షణం,
ఆశలేనిజీవితం ఊహకు అతీతం.
ఆయాచిత ప్రయోజనం,
అందని ద్రాక్షకు ఆరాటమనే-
ద్వంద్వ వింత పార్శ్వాలే,
మనిషి లోని స్వార్ధానికి బాటలు,
వ్యక్తిత్వానికి బీటలు!!
ఆశించే వ్యక్తికి ఆదరించే
గుణమూ అత్యావశ్యం,
మానవత్వానికి అది మరో రూపం.
ఆశించి,ఫలితాన్ని సృశించి,
ఆదమరచే వ్యక్తిత్వమే,
అన్నివిదాల అపహాస్యం!!
స్వంతలాభం కొంత మానితే
అల్లాడే బ్రతుకులకు ఆపన్నహస్తం,
చిరుసాయమైనా అది- మరోజీవితానికి ఆనందనేస్తం.
ఎన్నోమనసులను కదలించే
స్పూర్తికి దగ్గరిమార్గం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి