గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 28. కృపా మెరుపులు 
అనంతమైన తన అపజయాల నుంచి బయటపడేలా తనలో జ్ఞానపరమైన సంస్కరణతో సవరణ చేయమని ఈశ్వరుణ్ణి వేడుకుంటున్న భక్తుడు..... కరుణా సాగరుడిగా ప్రఖ్యాతుడవైన నువ్వు నీ కృపామెరుపులతో (అంటే వరాన్ని అనుగ్రహించినట్లుగా, మహిమాన్వితంగా) మాత్రం ఆ పని చేయకు  ప్రభూ..... అంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
నన్ను అల్లుకుని వున్న జీవన బంధాలన్నీ చాలా క్లిష్టమైనవి. వీటిని తెంచుకుందామని ప్రయత్నిస్తే హృదయవేదన కలుగుతుంది. వీటి నుంచి స్వేచ్ఛను కోరదామనుకోవడం నాకు సిగ్గు కలిగిస్తుంది. నువ్వు వెలకట్టలేని పెన్నిధివని , నా హితాన్ని కోరేవాడివని నేనెరుగుదును. నాలోని అహంకారాన్ని దూరం చేయడానికి నేను అంగీకరించలేను. అటువంటి మలిన ముసుగు కప్పుకునివున్న నా పక్కనే వికృతమైన మృత్యువు పొంచి వుంది.
జీవితమైనా, మృత్యువైనా ప్రేమించి అక్కున చేర్చుకునే తత్వం నీది. నాకు మాత్రం బ్రతుకును ప్రేమించడం, మృత్యువును ద్వేషించడం ఇష్టం.

కామెంట్‌లు