ఛాయాచిత్రాలు సైన్స్ వ్యాసం; -ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
 కాంతి లేకపోవడాన్ని నీడలంటాం. చీకటి కూడా నీడ్ అలాంటిదే. అంటే పోటాన్ ఎనర్జీ పాకెట్స్ లేనీ ప్రాంతాన్ని మనం చీకటి లేదా నీడ అని పిలుస్తాం.
భూగోళంలో అర్థగోళం పై పడిన కాంతి వల్ల పగలు మరియు మిగతా అర్థగోళం పై కాంతి లేకపోవడం వల్ల చీకటి ఏర్పడుతుంది. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఇది జరుగుతుంది.
సరిగ్గా అట్లాగే చంద్రునిపై సూర్యకాంతి పడటం వలన చంద్రోదయం అవుతుంది. అంటే చంద్రుని పై పడిన కాంతి పరావర్తనం చెంది తెల్లని వెన్నెల గా మారుతుంది.
ఏదిఏమైనా పోటాన్స్ ఎనర్జీ లేని కాంతి లేని భాగాన్ని మనం చీకటి లేదా నీడలు గా భావించవచ్చు శాస్త్రీయంగా. కానీ ఎక్స్రేలో కాంతి చొచ్చుకు పోలేని భాగాన్ని మనం నీడ గానే గుర్తిస్తాం. అందువల్ల ఎక్స్రేలో ఎముకల్ని మనం స్పష్టంగా పరిశీలించ గలుగు తున్నాము.
గోడ పైన ఉన్న ఒక క్యాలెండర్ లోని ఫోటోను పరిశీలించినప్పుడు దాన్ని మనం రంగుల తో సహా చూడగలుగుతున్నాం. అంటే ఫోటోలోని తల భాగం వెంట్రుకలు నలుపు రంగులో ఉన్నాయి అంటే ఆ నల్లని వెంట్రుకలు మిగతా ఆరు రంగులను పీల్చుకొని నల్లని రంగు మాత్రం బయటకు పంపించడం వలన ఆ భాగంలోని రంగు మన కంటికి చేరి మనం నల్లని భాగంగా గుర్తిస్తున్నాం. అంటే ఏడు రంగుల్లోఆరు రంగుల్ని పీల్చుకున్నబాగలోకూడా కాంతి లేనట్లే కదా అంటే అక్కడ ఏర్పడింది చీకటి ఆశోషించబడ్డ కాంతి లేని భాగాన్ని చీకటి లేదా నీడగా భావించ వచ్చు కదా. ఎందుకంటే ఏడు రంగుల్లో ఆరు రంగులు కాంతిని అది శోషించుకునీ కేవలం ఒక రంగును మాత్రమే బయటికి పంపించడం వలన మనం ఆ రంగును కంటి ద్వారా చూడగలుగుతున్నాం
సరిగ్గా అట్లాగే కెమెరా లో కూడా నీడ ద్వారానే ఛాయాచిత్రాలను తీయ గలుగుతున్నాం. అది కూడా కాంతి లేని భాగంగా భావించవచ్చు. కన్ను యంత్రాంగం కెమెరా యంత్రాంగం ఒకటే కనుక కన్నుల్లో కనబడే ఏర్పడే చిత్రాలు కెమెరా లో కూడా అదేవిధంగా ఏర్పడుతున్నాయి. కన్నులో ఏర్పడే చిత్రాలు కూడా ప్రతిబింబాలు కావు నీడలు లేదా చీకటి భాగాలుగా భ్రమ పడటం కాదు నిజంగా అవి చీకటి చిత్రాలు లేదా ఛాయాచిత్రాలు అని గుర్తించాలి. కన్నుల్లో ఏర్పడే ప్రతిబింబాలు కూడా నీడలే లేదా ఛాయాచిత్రాలు అని మనం అర్థం చేసుకుంటే చాలు.
అంతేకాకుండా అద్దం ముందు మనం నిలబడ్డప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు ఏర్పడే రంగుల ప్రతిబింబం కూడా ఛాయాచిత్ర మే. అంటే నీడలో వలన ఏర్పడుతుంది.
అలా మనం చీకటిని నీడలను ఛాయాచిత్రాలు గా ప్రతిబింబాలుగా కన్నుల్లో కెమెరాల్లో అద్దంలో చూడగలుగుతున్నాం. అంటే ఫోటాన్ రోహితభాగంగా అంటే కాంతి లేని భాగంగా ఎక్స్రేలో కూడా చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఛాయాచిత్రాలు.
ప్రతిబింబాలు ఛాయాచిత్రాలు అన్నీ కూడా అసంపూర్ణ కాంతి రహిత భాగాలుగా గుర్తించాలి. అవి ప్రతిబింబాలు కావు నీడలు లేదా ఛాయా చిత్రాలు లేదా చీకటి చిత్రాలుగా భావించాల్సి వస్తుంది ఇవన్నీ రంగుల్లో కూడా ఉంటాయి.
అంకితం ప్రొ.శివప్రసాద్.పాలెం . గార్కి
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు