సాధారణ జీవనం____ అసాధాణభావన; --గాంధీ నారాయణ. - MSc physicsరిటైర్డ్ DSP సైబరాబాద్--హైదరాబాద్
 _______
విశ్వంలో అత్యంత అరుదైన మహామేధావి
 ఆల్బర్ట్ ఐన్స్టీన్
_______
 నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవన మెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ ఎవరు? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
 అని ప్రశ్నిస్తాడుమన మహాకవి. శ్రీ. శ్రీ 
అతి సామాన్యుడు మాన్యుడు ఏలా గలిగినాడు? వారి జీవిత గమనంలో ఏమిటి వారు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఎన్ని ఒత్తిడులను ఎదుర్కున్నారు? వాటిని వారు ఎలా తట్టుకోగలరు ?వారి గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది .
వైజ్ఞానిక వినువీధిలో ధ్రువతారగా నిలిచిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ దక్షిణ భాగంలో ఉన్న బవేరియా రాష్ట్రంలో ఉెళం అనే నగరంలో 1879 మార్చి 14వ తేదీన ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మించాడు .ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు చిన్నతనములో మాటలు రావడానికి చాలా కాలం పట్టింది. బట్టి పట్టడం వల్లే వేయడం అనేది అతనికి సుతారం ఇష్టం ఉండేది కాదు .అతని ఆలోచన ,భావన స్వచ్ఛమైనది". ఆల్జీబ్రా అంటే మైండ్ గాబ్రా "అంటారు. ఆల్జీబ్రా అంటే ఏమిటి ?అది ఒక సోమరిపోతు గణితం తెలియని ఎక్స్ పదాన్ని కనుక్కోవడానికి కుస్తీ పట్టడం. సమస్య ఎంత కష్టమైతే అతనికి అంత ఇష్టం .అందుకే గణిత మన్నఅతనికి అమితాసక్తి .ఎవరైనా ఆల్జీబ్రా జామెట్రీ పుస్తకాలు ఇస్తే అతనికి పరమ ఆప్తమిత్రుడు తన పిన తండ్రి ప్రోత్సాహంతో గణిత ప్రపంచంలో తీవ్ర అన్వేషణ ప్రారంభించినాడు. డాక్టర్ స్పీకర్ రచించిన జామెట్రీ పుస్తకం పూర్తి గా జీర్ణించుకున్నాడు. మాక్స్ టాలమీ ఇచ్చిన ఈ పుస్తకం అతన్ని తన్మయి ని చేసింది. గంటలకొద్దీ గదిలో విడవకుండా దీక్షగా కూర్చునేవాడు అప్పుడు అతని వయస్సు సుమారు 10 సంవత్సరములు .
14 ఏళ్ల వయసు వచ్చేసరికి అతని వేగానికి ఉపాధ్యాయులు తట్టుకోలేకపోయారు వారికి అది అసాధ్యం అయిపోయింది .గణితంలో అతను గురువు వారు శిష్యులు .జ్ఞాన తృష్ణ తో అమితాశసక్తి తో ప్రశ్నల పరంపర గుప్పించే వాడు. ఉపాధ్యాయులే కాదు ప్రపంచంలో ఎవ్వరు కూడా అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోకపొయినారు. అతని ప్రశ్నలకి తర్వాత తర్వాత అతనే సమాధానాలను  వెతుక్కున్నారు. విచిత్రమేంటంటే వైజ్ఞానిక వేత్తగా చరిత్రను తిరగ రాసిన ఆల్బర్ట్ జంతుశాస్త్రం లో మరియు  వృక్ష శాస్త్రంలో ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. ఉత్తీర్ణత సాధించని దే ముందుకు పోలేడు కాబట్టి దానికోసం మరో పాఠశాలలో చేరి ఒక సంవత్సరంమళ్లీ చదవాల్సి వచ్చింది. అది ఉత్తీర్ణత సాధించిన తర్వాత జూరిచ్ టెక్నిక్ విద్యాలయం లో చేరి తనకిష్టమైన విద్యను కొనసాగించినాడు.ఈ విద్యాలయం లో నాలుగు సంవత్సరాలు తండ్రి సహాయం లేకుండా ఒక చిన్న గదిలో కొద్దిపాటి బట్టలతో మితమైన ఆహారం తో గడిపినాడు .దరిద్రాన్ని అనుభవిస్తూ మధ్య మధ్య పస్తులతో విద్యను పూర్తి చేయగలిగాడు ."పట్టభద్రుడననైన తర్వాత నా భవిష్యత్తు ఏమిటిఅన్న ప్రశ్నకు ప్రతి విద్యార్థి జవాబు వెతుక్కోక తప్పదు. మనం పడే శ్రమకు ఎప్పుడో ఒకప్పుడు తప్పక ప్రతిఫలం లభిస్తుంది అనుకొని మన గమనాన్ని సాగించక తప్పదు .ఉద్యోగం కోసం నగరంలో తిరగడం మొదలు పెట్టాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం వలన వచ్చిన డబ్బు సరిపోవడం లేదు తాను చదువుకున్న విద్యాసంస్థల్లో సహ ఉపాధ్యాయునిగా తీసుకోమని పూర్వపు ఉపాధ్యాయులను వేడుకున్నాడు .అతని ప్రతిభను చూసి జడిసిన ఉపాధ్యాయులు అతని చేర్చుకుంటే తమ స్థానాలకు  భంగం కలుగుతుందని గ్రహించి అతను యూదు జాతి వాడనే మిషతో ఉద్యోగంలో చేర్చుకోవడానికి నిరాకరించారు." యూదులలో పుట్టిన పాపానికి పస్తులుండి చావాల్సిందే నా " అని బాధ పడడు. వింటర్ ధూర్ నగరంలో సాంకేతిక వృత్తి విద్యా లయంలో ఉపాధ్యాయుడిగా ఆరు నెలలు పని చేసినాడు. అతని పాఠాలు వినడానికి  విద్యార్థులు ఆత్రుతతో ఎదురుచూసేవారు.ఆసక్తికరమైన ఆయన బోధన వారిని ఎంతగానో ఆలోచింపజేసింది. అతన్ని కొనసాగించక పోవడానికి కారణం ఏమైనా విద్యార్థులలో అసంతృప్తి మిగిలిపోయింది .
ఎంతటి మహోన్నత వ్యక్తి కైనా ఒడిదుడుకులు ఉంటాయి. ఎన్నో ఉలి దెబ్బలకు ఓర్చు కుంటేనే గాని  శిల శిల్పం కాజాలదు .అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యం ఉన్నట్లే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే శోధించి సాధించాలి అదే  ధీర గుణంఅనే  శ్రీ శ్రీ ప్రవచనాలు ఇక్కడ అ స్ఫూర్తినిచయ.
తన సహచర విద్యార్థి మీ లేవా మారిస్ హంగేరి దేశస్తురాలు తో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ కానీ స్థిరమైన ఉద్యోగం లేకపోవటంవల్ల వాయిదా వేసుకున్నాడు .
స్విట్జర్లాండ్ కు ముఖ్య పట్టణమైన బెరన్ నగరంలోని పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం లభించింది. జీతం తక్కువ కాకపోయినా సరిపెట్టుకోవచ్చు నన్నే భరోసా దొరికింది దానితో అతను మిలేవాను వివాహం చేసుకున్నాడు .అతనికి ఆ ఉద్యోగంలో లో ఉజ్వల భవిష్యత్తు గోచరించింది.ఈ ఉద్యోగం తనకు "చెప్పులు కుట్టే పని "అని తాను చెప్పుకున్నాడు .ఉద్యోగంలో తనపని క్షణాల్లో ముగించుకుని మిగతా కాలం తనకిష్టమైన గణిత సమస్యలను సాధించుకుంటాం ఉండేవాడు. ఈ సమయంలోనే వైజ్ఞానిక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన సాపేక్ష సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రతిపాదించాడు .ఇది 1905 లో జరిగింది ఇప్పటికీ వారి వయస్సు 26 సంవత్సరాలు పేటెంట్ ఆఫీసులో లో మూడు సంవత్సరాలు డెస్క్ వద్ద కూర్చొని చేసిన కృషి ఫలితం ఈ సాపేక్షసిద్ధాంతం. ప్రముఖులైన వైజ్ఞానికులు ముఖ్యంగా జ్యూరిచ్ పండితులు సిద్ధాంతం ఒక అపూర్వమైన అని గ్రహించారు.  
 "ఈ ఐన్స్టీన్ ఎవరు "?
" ఈయన ఎక్కడివారు ,?
ఏ విశ్వవిద్యాలయం   లో పనిచేస్తున్నాడు ?" అని ప్రశ్నించడం మొదలు పెట్టినారు .ఒక పేటెంట్ ఆఫీసులో గుమస్తా గా పని చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు .
కొత్త విషయం కనిపెట్టి నందుకు కొందరు  అసూయ గ్రస్తులై పిచ్చివాడి కింద జమ కట్టినారు ఈ సిద్ధాంతం తప్పని రుజువు చేయడానికి నడుం కట్టారు .అందులో వీరు విఫలం అయ్యారు
  సాపేక్ష సిద్ధాంతము గూర్చి పరిశోధనలు చేస్తున్నంత కాలము వీరు విశ్రాంతి ఎరుగరు
 ఆయన మేధాసంపత్తి సృజనాత్మక శక్తి పూర్తి వికాసాన్ని పొందిన కాలమిది. గురుత్వాకర్షణ గూర్చి ఒక ముఖ్య సిద్ధాంతాన్ని పూర్తిచేసి 8 సంవత్సరాల ముందు గానే 1919 మార్చి 29న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 చంద్రుడు సూర్యుని ముందుకు వచ్చి సూర్యుని పూర్తిగా కప్పే చేసినప్పుడు  సూర్యుని దగ్గర మనకు నక్షత్రాలు కనబడతాయి. గురుత్వాకర్షణ కు సంబంధించిన ఈ సిద్ధాంతము వాస్తవమైతే నక్షత్రాలు తమ స్థానం నుండి కొంచెం పక్కకు తొలగినట్లు మనకు కనబడి తీరాలి అని ఐన్స్టీన్ సిద్ధాంతీకరించాడు. వాస్తవంగా నక్షత్రాల స్థానంలో',
 స్థితిలో మార్పు కలగదు నక్షత్రాల నుండి వచ్చే వెలుగు కిరణాలు సూర్యుడి గురుత్వాకర్షణ క్షేత్ర ప్రభావం వలన తమ మార్గము నుండి తొలగుతాయి, కాబట్టి నక్షత్రాలు వాటి స్థితి మారినట్లు మనకు కనబడుతుంది .
ప్రపంచ ప్రఖ్యాత వైజ్ఞానిక సంస్థ అయిన రాయల్ సొసైటీ ఈ దృగ్విషయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి నడుము కట్టింది. రెండు వైజ్ఞానిక బృందాలను ఏర్పరిచి ఒక దానిని బ్రెజిల్లోని సో బెల్ కు రెండవదాన్ని ఆఫ్రికా లోని ప్రిన్సిపి పంపించినారు. సంపూర్ణ సూర్యగ్రహణం 1990 మార్చ్ 29 నాడు బలమైన  చాయాగ్రహణ యంత్రాలతో  సూర్యగ్రహణం యొక్క ఛాయా పటాలను తీసుకొని వాటిని డెవలప్ చేసి పరిశీలించి చూడగా    అతను చెప్పినది అక్షరాల నిజమని ఆ సిద్ధాంతం రుజువైన దని తేల్చి చెప్పినారు .
ఈ ఒక్కరోజే అన్ని ఐన్స్టీన్ "జగత్ ప్రసిద్ధుడయ్యాడు" ప్రపంచం అతని ప్రతిభను కొనియాడింది ,కానీ ఇది నా ప్రతిభ కాదు శాస్త్ర విజ్ఞానము దీనికి ఆధారము అన్నా ఐన్స్టీన్ సౌమ్యుడు .
పదార్థ విజ్ఞాన శాస్త్రంలో తాను సిద్ధాంతీకరించారు శక్తి నిత్యత్వనియమానికి గాను 1922లో నోబెల్ బహుమతి లభించింది .ఈ సూత్రము అణుబాంబు నిర్మాణానికి దారి తీసింది.
ఐన్స్టీన్ యూద్ జాతి వాడని' ప్రపంచ శాంతి కాముకుడు అని జర్మనీ నియంత హిట్లర్ వర్గీయులు వేధించడం మొదలు పెట్టినారు .అతని పేరు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో మారుమ్రోగాయి .ఆ ప్రతిభాశాలి కి తాను యూదుడననిన భావన గాని  స్మృతి గాని లేదు .కానీ పరిస్థితులు ఆయనను అలా వదిలిపెట్టలేదు .జర్మన్ వైజ్ఞానిక లకు సహితం ఈ విద్వేష భావం ఏర్పడింది ఐన్స్టీన్ కు వ్యతిరేకంగా సభలు-సమావేశాలు ఉపన్యాసాలు ప్రారంభించారు. అంతే కాకుండా ఎన్నో నీచమైన కార్యాలకు పాల్పడినవారు.
 పాలస్తీనా నిర్మాణం కోసం  యూద్విశ్వవిద్యాలయ స్థాపన కోసం అమెరికాకు వెళ్లి లక్షల కొద్దీ డాలర్లను సేకరించారు
 . బెర్లిన్ కు సమీపంలో హలేన్ నది ఒడ్డున కాపుర్ అనే గ్రామంలో ఒక సరస్సు పక్కన విశాలమైన ఇల్లు కట్టుకుని కులాసాగా పడవ షికారు చేస్తూ గడిపేవాడు .కానీ ఐన్స్టీన్ పట్ల నాజీల వ్యతిరేకత నానాటికీ పెరిగిపోయింది, బెదిరింపులు ప్రారంభమయ్యాయి  ఐన్టీన్  సన్నిహితుడైన డాక్టర్ రెధౌనే ను హత్యగా భావించి నారు.ఐన్టీన్ తలను తెచ్చిన వారికి వెయ్యి పౌరులు బహుమతి ప్రకటించారు. చావును తప్పించుకోవటానికి ప్రపంచ పర్యటన చేయాల్సి వచ్చింది. ప్రపంచ దేశాలలో ఎక్కడికి వెళ్లినా అతనికి అరుదైన గౌరవం మర్యాదలు స్వాగత సత్కారాలు లభించాయి .
1930లో 9:30 ప్రపంచ మహాపురుషుల  గౌరవార్థం న్యూయార్క్ లో నూతనంగా నిర్మించిన రివరి సైడ్ చర్చపై మహా పురుషులైనా కాంట్, ప్లేటో ,కన్పుెషియన్, బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త మొదలైన వారి ప్రతిమలతో పాటు ఐన్స్టీన్ ప్రతిమను కూడా చిత్రీకరించారు .చరిత్ర ప్రసిద్ధమైన ఆరు వందల మంది పురుషులలో తాను ఒక్కడే జీవించి ఉండటం మిగతా వారు కీర్తిశేషులై ఉండటం అతన్ని ఆశ్చర్యనికి గురిెయై విస్మయం కలిగించింది.
ఐన్స్టీన్ ,కమ్యూనిస్ట్ అభిమాని అని అభ్యుదయ వాది అని గొప్ప మానవతావాది కావడం వల్ల అతనిపై జర్మన్ లకు ద్వేష భావం అధికమైంది బెల్జియంలొ ప్రయాణిస్తున్న సమయం లో కాపూర్ లోని తన గృహంలో లో ఆయుధాలు , మందుగుండు సామాగ్రి దాచినట్లు ఆరోపణలు చేసి గృహాన్ని పూర్తిగా దోచుకుని ,నేలమట్టం చేసి చివరకు ఒక. క,త్తిని తీసుకెళ్లారు.
 ఐన్స్టీన్ పేరు ప్రతిష్టలు ఇం
ఎంత గా గడించాడొ అంతగా సమస్యలు అతని వెంటాడినవి  వాటన్నిటిని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని గెలిచినాడు. ప్రపంచ శాంతి కోసం అవిరళ కృషి చేసినాడు, ఆటంబాంబ్ నిర్మాణంలో గాని ఇతర మారణాయుధాల నిర్మాణంలో గాని అతనికి నేరుగా ఎలాంటి సంబంధం లేదు .కానీ తాను 1905లో ప్రతిపాదించిన గణిత సూత్రం E=MC'2 ఆటంబాంబ్ పరిశోధనలకు ప్రాతిపదిక అయ్యింది .హీరో సినిమా నాగ సాకియా లో అణుబాంబు ప్రయోగం అతన్ని కలిచివేసింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈ ఆటం శక్తిని ప్రపంచ వినాశనాని కాకుండా విశ్వశాంతి కోసం ఉపయోగించవచ్చునని, ఇళ్లల్లో దీపాలు వెలిగించడానికి , ఫ్యాక్టరీలు నడపడానికి కూడా ఉపయోగించవచ్చునని ఈ శాస్త్ర విజ్ఞానాని మానవాభ్యుదయం కోసం వినియొగించాలని ఆకాంక్షించి నాడు." ఆయుధాల వలన కానీ శాస్త్ర రహస్యాలు వల్ల కానీ మనకు రక్షణ చేకూరదు న్యాయమైన సక్రమమైన విధానాలను అనుసరించటం వలన విశ్వమానవాళికి శాంతి చేకూరుతుందని ఉద్ఘాటించాడు .
1949లో తన 75వ ఏట భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని  ఆవిష్కరించినాడు (General Theory Gravitation) మనం సక్రమంగా ప్రవర్తిస్తే ఉజ్వలమైన ,అద్భుతమైన భవిష్యత్ కలుగుతుందని, వైజ్ఞానిక పరిశోధనల ఫలితాల వలన మన జీవితాలకు సౌఖ్యము సంక్షేమం కలుగుతుంది. మనిషి కి బ్రతికే హక్కు ఏర్పడుతుంది ప్రపంచంలో శాంతి సహనం సుస్థిరం అవుతుందని  ప్రకటించాడు
 ఈ మహా విజ్ఞానాన్ని జీవితాంతం వరకు మానవ జాతి మనుగడ కోసం సత్యాన్వేషణ కోసం నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తూ ఏప్రిల్ 18 th 1955 నాడు పరమపదించినాడు

కామెంట్‌లు