బాలల్లారా ; -టి.తరుణ్(s/o) బుచ్చన్న,8/B తరగతి,TTWURJC(B)KONDAPUR,(మం)ధన్వాడ,(జి)నారాయణపేట,(రా)తెలంగాణ.

 బాలల్లారా!ఓ బాలల్లారా
భావి భారత పౌరుల్లారా
ఆశయం నిండిన అడుగులు వేస్తూ
గుండె ధైర్యంతో నడవండి 
                         "బాలల్లారా"
వికసించే పూవులా పూయగా
సింగిడి రంగుల సాక్షిగా
మా నవ్వులు నింగిని తాకెనుగా
మీరే మీరే భారత పౌరులురా
                                "బాలల్లారా"
భారతమాతకు ముద్దు బిడ్డలు
మీ చక్కటి నడతతో, చెలిమితో
 ఎన్నో అందమైన ఊహాలతో
 ఎల్లలు చెరిపి ఆకాశాన్నే అందుకోండి
                           "బాలల్లారా"
నెత్తురు దారల సాక్షిగా
గుండెల్లో గుడినే కట్టి
చేయండి గౌరవ వందనం
తెలపండి మనతల్లికి అభివందనం
                                  "బాలల్లారా"

కామెంట్‌లు