మహమ్మారి;-కె.భాస్కర్(s/o)చెన్నమ్మ,8/b తరగతి,TTWURJC(B)kondapur,(మం)ధన్వాడ,(జి)నారాయణపేట,(రా)తెలంగాణ.

 మాయదారి రోగమిది కల్లోలం లేపే రాక్షసిది
ప్రాణాలను హరించే మహమ్మారి ఇదేరా
సంతోషాలను తొలగించి ఆటంకాలను పెంచేసే
యమలోకాన్ని మించిన రాక్షసి ఇదేరా
అందుకే...అందుకే మాస్కులను ధరించరా  ఓ..మానవా
సినిమా షికార్లను తగ్గించరా ఓ..మానవా
                            "  మాయదారి"
ఆదివారము వస్తే చికెన్,మటన్
దావతులు చేసుకునే కాలము ఇది కాదురా
పండగలు,పబ్బాలు ఫంక్షన్ లంటూ
గుమిగూడె పరిస్థితి ఇప్పుడు లేదురా
అందుకే ఇంట్లోనే వుండరా ఓ..మానవా
అనవసరంగా బయటికి వెళ్ళొద్దురా ఓ..మానవా
                           "మాయదారి"
ఎంతో మందిని అనాథలను చేసేసి
భవితను నాశనం చేసే మహమ్మారి ఇదేరా
మానవత్వమును కలిగిన ఓ మనిషి పరిస్థితిని గాంచి
కొంచెం జాగరూకతతో మెలగరా
రోగమే వస్తే ఏ నలుగురు తోడు రారు
యంత్రాలే నిన్ను సమాధి చేసేది
అందుకే నీ జాగ్రత్తలో నీ వుంటూ జాతికి రక్షణ కవచంగా మారరా
                     "మాయదారి"

కామెంట్‌లు