కందం:
*ఇల్లాలబ్బెనటంచును*
*దల్లింగనితిట్టికొట్టి తరిమెడితనుభృ*
*త్తల్లజునకు భువి గీర్తియుఁ*
*గుల్లలుగద దివిసుఖములు గువ్వలచెన్నా!*
తా.: ..
తనకు భార్య దొరికింది అని, ఇంతకాలము తనను పెంచి పెద్దచేసిన తల్లిని నిందిస్తూ, ఇంటిలో నుండి బుటకు పంపించే కొడుకులకు, తను వుంటున్న సమాజంలో గౌరవం దక్కదు. తరువాత స్వర్గ సుఖాలూ దక్కవు......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*యుక్తవయసు వచ్చి, సంపాదన పరులైన తమ పిల్లలకు వివాహము జరిపించడం మన సమాజంలో తల్లితండ్రుల బాధ్యత. అప్పుడు మన ఇంటికి కోడలు రూపంలో ఒక స్త్రీ వస్తుంది. తన ద్వారా మన వంశం వృద్ధి చెందుతుంది. అంటే, మన వంశోన్నతికి సహాయపడుతుంది ఆ వచ్చిన కోడలు అనబడే స్త్రీ. ఆమెను మనమందరం అక్కున చేర్చుకుని, ఆమెను సంతోషంగా వుంచుతూ, మాటల వరకే కూతురు గా కాకుండా మనసా వాచా కర్మణా కూడా కూతురు గా చూసుకోవాలి.*
*ఇంటికి వచ్చిన కోడలు కూడా, తాను ఈ ఇంటికి కోడలిని మాత్రమే ఈ ఇల్లు తనది కాదు అనుకోకుండా, ఇప్పటి నుండీ, ఈ ఇల్లు నాది, ఈ ఇంటిలోని మనుషులు నావాళ్ళు, ఇక్కడ వున్న అత్తమామమలు, తన తల్లిదండ్రుల స్థానంలో వున్నారు అని ఒప్పుకుని జీవనం మొదలు పెట్టాలి. అప్పుడు, రోజు సాగే క్రమంలో వచ్చే చిన్న పొరపాట్లు పెద్దవిగా అనిపించవు. జీవన నావ ఒడిదుడుకులు లేకుండా సాగి పోతుంది.*
*ఇక్కడ ముఖ్య పాత్ర, వివాహం చేసుకున్న పురుషునిదే.అయితే, " వినదగు నెవ్వరు పల్కిన, విననంతనే వేగ పడక" అన్నట్లుగా, భార్య మనకంటే వయసులో చిన్నదైనా, ఆమె చెప్పిన మాట వింటూ ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇది నిజం. కానీ, తల్లి ఎదురుగా భార్యను, భార్య సమక్షంలో తల్లిని చిన్నపుచ్చే పని మనం చేయగూడదు. ఎందుకంటే, ఇవాల్టి మన స్థాయికి తల్లి కారణమైతే, రేపు మన ఎదుగుదలకు భార్య తోడ్పాటు, తల్లిదండ్రుల దీవెనలు కావాలి. ఈ రోజు మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా చూచుకుంటామో, రేపు మన పిల్ల ద్వరా మనకు అదే జరిగే అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఎందుకంటే, మన పిల్లలు మనల్ని, మన ప్రవర్తనను చూస్తూనే కదా, పెరుగుతారు, ఎదుగుతారు. ...*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి