*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౬౬ - 066)
 కందం:
*తలపరువు నోరె చెప్పును*
 *లలికాయలపండుపరుపు రంగే చెప్పున్*
*కలవాని జవమునడకయుఁ*
*గులమును వేషంబు చెప్పు గువ్వలచెన్నా!*
తా.: ..  
ఒక వ్యక్తి ఎంత గౌరవం గా వుంటారు అనేది అతను మాట్లాడే విధానం చెపుతుంది.  మంవి పండు యొక్క రంగు, ఆ పండు ఎంత బాగా పండింది అనే విషయం చెపుతుంది.  ధనవంతుల నడత, వారి వేగము  వారి రూపము ద్వారా నే తెలుసుకొన వచ్చును......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*"నోరు మంచిదైతే, ఊరు మంచిది ఔతుంది " అని పెద్దల మాట.  మనము మాట్లాడే విధానం మన విజ్ఞతను, ఔన్నత్యాన్ని తెలుపుతుంది. అందువల్ల, మాటలను వీలైనంత పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలి.   మనతో ఎంతగా విభేదించే వారు అయినా, అవతల వారికి అర్ధమయ్యే రీతిలో మనం వివరణ ఇవ్వ గలిగితే, కొంచెం ఆలస్యమైనా, మనం చెప్పిన విషయం అర్ధమైన తరువాత మనవైపు వస్తారు.  మనవద్ద ధనం వుంది అనే విషయాన్ని మన వేష , భాషల ద్వారా తెలియ చేయ నక్కరలేదు.  మన దగ్గర ధనము, విద్య ఉన్నప్పుడే మనం ఇంకా అణిగిమణిగి, అణకువతో వుండాలి. మన అవసరాలు పోను మన వద్ద మిగిలిన ధనం ఇతరుల మంచికి ఉప్యోగపడేలా వుండాలి. "అన్న వున్న విస్తరి అణిగిమణిగి వుంటంది" అని కదా నానుడి.*
*అందువల్ల, నలుగురి మంచి కోరుకోవడం, నలుగురికి ఉపయోగపడే లాగా మన జీవనం వుండేలా పరంధాముడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ......*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు