కందం:
*చుట్టరికముఁ జేసికొనన్*
*గట్టడిగాఁ దిరిగితిరిగి కార్యంబైనన్*
*మిట్టిపడచు మాట్లాడఁడు*
*గుట్టెంచునియోగివరుడు గువ్వలచెన్నా!*
తా.: ..
పనులు సాధీచే విధానము తెలిసిన నియోగి శ్రేష్టుడు అవసరమైన వరకు చుట్టరికము కలుపుకుని అయినా తన పని సాధించుకుంటాడు. బెట్టు చేయడు. ఒకటికి పదిమార్లైనా తిరుగుతాడు. గర్వం ప్రదర్శించడు .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*"ఈ పద్యంలో, కార్య సాధకునికి వుండవలసిన లక్షణాలను చెప్పారు, కవి. ఒక పని సంపూర్ణంగా సాధించాలి అంటే ఓర్పు, సహనం, నేర్పరితనం ఎంతైనా అవసరం. ఏ విషయాన్ని అయినా, ఎంత చిన్న వారినుండి అయినా, నేర్చుకోవడానికి సిద్ధంగా వుండటం కూడా అవసరమే. అన్నీ నాకు తెలుసు. వేరెవరూ చెప్పనవసరం లేదు అనుకునే వారు మంచి కార్యసాధకులు అవలేరు. ఒప్పచెప్పిన పనిని పూర్తి చేసే దారిలో గర్వం, అహంభావం అసలు చూపించకూడదు. తను ఒక సమూహం తో కలసి ఒక విషయం సాధించ వలసి నప్పుడు, సమూహంలో అందరినీ కలుపుకుని పోతూ, అందరి ఆలోచనలకు తగిన విలువ ఇస్తూ, వింటూ, చివరికి తను చేసుకున్న నిర్ణయాన్ని సమూహం నిర్ణయంగా ఒప్పించ గలగాలి. అటువంటి వాడే విజయాన్ని సాధంచే నాయకుడు కాగలుగుతాడు.......*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి