*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౭౩ - 073)
 కందం:
*వేషముల చేతలొకటను*
 *భాషాపతికులులు మొదలు పదజులవరకున్* 
*శేషించి యొకఁడు నుండఁడు*
*ఘోషాయను బోవుముందు గువ్వలచెన్నా!*
తా.: ..  
బ్రహ్మ వంశములో పుట్టిన బ్రాహ్మణుల నుండి విష్ణుమూర్తి పాదలనుండి పుట్టిన శూద్రకులములో పుట్టిన వారి వరకూ అందరినీ వారి నడతను బట్టి, చేసే పనులను బట్టి గుర్తు పట్టడం చాలా కష్టం.  అలా గనక గుర్తు పట్టాలి అంటే ముందుగా వాళ్ళ గుట్టు బయట పడుతుంది  ......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*"ఈ నాడే కాదు, పట్టాభిరామ కవి కాలంలోనే కాదు, ఏనాడైనా మనిషి రెండు విధాలుగా ప్రవర్తిస్తున్న వాడే.  అనేకమందిలో బయటకు కనిపించేది నటన మాత్రమే.  నిజం ఎప్పుడూ మనిషి లోలోపలే దాగి వుంటోంది.  ప్రతీ మనిషి తన నిజమైన మనిషిని పరిచయం చేసుకుని, ఆ నిజమైన వ్యక్తి తోనే, అంటే, తనతో తానే జీవించిన రోజు ఈ జగమంతా పండుగ వాతావరణం అలదు కుంటుంది.  ప్రతీ మనిషి, తన రెండు నాల్కల ధోరణినీ, లోపలా బయటా రెండు రకాలుగా వుండే జీవన విధానాన్ని వదలి, తత్వమసి అని జీవితం గడిపేలా మార్కండేయ వరదుడు మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ.......*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు