*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - ౨౬ (26)*
 *బ్రహ్మ, విష్ణవు లకు - నిష్కల పరబ్రహ్మ రూపమైన లింగ రూప పరిచయము - ౧*
*నాశనము కాకుండా, చాలాకాలము తమ స్వ స్వభావమును కోల్పోని వస్తువులను "పురుష వస్తువులు" అంటారు. చిరకాలము కాకుండా, కొంతకాలము మాత్రమే వుండే వాటిని "ప్రాకృత వస్తువులు" అంటారు.  మహాశివుని పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు పురష వస్తులు అనే చెప్పబడ్డాయి. హారములు, మూపురములు, కేయూరములు, పుష్పమాల, పట్టు వస్త్రములు ఇటువంటివి అన్నీ. బ్రహ్మ, విష్ణువు తమ మధ్య నిలబడిన మహాశివుని పైన చెప్పబడిన వివిధములైన వస్తువులతో పూజించారు.   బ్రహ్మ, విష్ణువు ల చేత పూజింపబడడం ఒక్క పశుపతికే చెల్లు. బంధాలలో బంధింపబడిన బద్ధజీవి ఈ విధమైన విశిష్టమైన పూజను పొందలేడు. వేరే ఎవరినైనా పూజించక ముందే బ్రహ్మ, విష్ణువు లు బోళాశంకరుని పూజించారు.  వారి పూజలు అందుకుని చాలా పరమానంద భరితుడయ్యాడు ఆనందకారకుడు, పరేశుడు పరాత్పరుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు