బ్రతుకు బాట :- సాహిత్య పఠనం - అవగాహన... కోరాడ నరసింహా రావు !* 52 **

  సాహిత్యం లోకి అడుగిడిన నాటి నుండి... ఎన్నెన్నో సభలు 
సమావేశాలు...ప్రతి సభాసమా
వేశాలలో...కవితలు చదవటం 
వేదికమీద నామొదటి కవితా పఠనమే  ఆధ్యాత్మిక కవితతో !
"పొన్నూరు మోజుపుట్టి ఉన్నూరు వదిలి పెట్టె... విన్నార ఆ కథను... కన్నారా ఆ వ్యధను అంటూ మొదలుపెట్టి 
నేను కవిత చదువుతుంటే.... 
నిర్వాహకులు సహ కవులూ ఆసక్తిగా విని అభినందించారు 
నాకు సాధారణంగా కాగితం చూసి కవితచదివే అలవా టుం డేది కాదు...!చూడకుoడా నే  కవిత చెప్పేవాడిని, ఇంచుమించుగా అన్నిసభల లోనూ... సీనియర్లు... కవితలు గానీ, కదలుగానీ..మనంవ్రాయ టoకన్నాముం దు..ఎక్కువగా చదవాలి అంటుండేవారు మనముండువాళ్లంతా ఎలా రాస్తున్నారో గమనించాలి అంటుండేవాళ్లు ! అప్పటికే 
మాఊర్లో సీనియర్ పత్రికావిలేఖరి సముద్రాల సత్యనారాయణ గారితో నాకు బాగా పరిచయం ఉండటం చేత...అప్పటికే  ఆయన rtc. కాంప్లెక్ లోశ్రీ శ్రీ బుక్ స్టోర్స్పెట్టి 
పుస్తకాలు అద్దెకు కూడా ఇస్తుండటం తో... అక్కడ నుండి... మరొకరిద్దరు మిత్రుల దగ్గర నుండి కూడా పుస్తకాలు తెచ్చి చదివేవాడిని! పూర్తి గా ఓఐదారుసంవత్సరాలురాయటంకన్నా  చదవటమే -  చదవటం...  !
ఆ రోజుల్లోనే... గోర్కీ  (అమ్మ )
ఛాంగీజ్ ఖాన్, ఏడుతరాలు, ఓల్గాసే గంగ,కాళరాత్రి,త్వమే
వాహం, ఆంధ్రావైతాళికులు, 
అమృతంకురిసినరాత్రి,మోదుగపూలు (నవల )గాంధీ ఆత్మకథ, 
నెహురూ జైల్లో ఉండగాఇందిరా గాంధీకి రాసిన ఉత్తరాలు,శ్రీ శ్రీ సాహిత్యం, చలం, చాసో కధలు, కమ్యూనిస్ట్ సాహిత్యం 
తాపీ ధర్మారావు దేవాలయా లపై బూతుబొమ్మలు, నాస్తికవాద, దోగంబరవాద స్త్రీవాద మొదలైన వివిధ వాదాల సాహిత్యం... ఇలా నిజానికి నేను చదివింది తక్కువే కావచ్చు గానీ నాకు అందుబాటులో దొరికిన ప్రతిపుస్తకాన్ని చదివాను !
ఐతే... ఈ పుస్తకాలన్నీ నాకు విషయ పరిజ్ఞానానికే ఉపయోగ పడ్డాయి గానీ వాటి మూలంగా రచనలకూ, కవిత్వానికీ సంబంధించిన మెళకువలంటూ నాకు తట్ట లేదు ఆలా చదివి సాహిత్యా న్ని రాయటం నేనేమీ నేర్చుకోలేదు నేను చూసిన  సమాజానికి నాహృదయ స్పందనల ప్రతి స్పందనలే... 
నేను వ్రాసింది, వ్రాస్తున్నదంతా!ఈ పుస్తకాలన్నీ నాలో తార్కిక దృష్టిని పెంచటంతో పాటు సామాజిక వివిధ స్థితిగతుల అవగాహనకు తోడ్పడ్డాయి !
గురజాడ, కందుకూరి రచనలు 
సమాజం పట్ల ప్రేమని, బాధ్యత ని ప్రేరేపించాయి !!
నేను చదివిన అన్నిరకాల పుస్తకాల మూలంగా... విశేషమైన అవగాహన, ఆలోచన, పట్టాభిరామ్,యండమూరి లాంటివారి రచనలవలన సమాజము, వ్యక్తి, వికాసము 
అన్నిటిపట్లా...సరైన దృక్పధం ఏర్పడిందనే చెప్పాలి !
పుస్తకాలు మస్తకాలను చైతన్యవంతం చేసి..మనిషిని 
మనిషిగా తీర్చి దిద్దుతాయ న్నది  సత్యము... !!
      *******
   ........    సశేషం  .......
కామెంట్‌లు