గజల్ ; సోంపాక సీత--భద్రాచలం-- 8639311050
సింహబలుడవు భరతధీరా..కుటిలనీతిని ప్రశ్నించరా?
మొద్దునిద్దుర వదలిసూటిగ..కుతంత్రాలను ప్రశ్నించరా?

ఓటుబ్యాంకు,నోటుగాటకు.. కట్టుబడకుర స్వార్థపరుడా
రాజకీయపు దురద ఎందుకు?..విశృంఖలాలను ప్రశ్నించరా?

రాజరికాలు పోయెనెపుడో..హిట్లర్ పాలన చెల్లబోదుగ
మానధనుడవు స్వేచ్ఛనీదే..అగ్గికణమై ప్రశ్నించరా?

అమ్ముడైతే బానిసేగా.. సాలెగూటికి చిక్కుటెందుకు?
వివేకుడవై చిక్కులెక్కను..చురకత్తివోలె ప్రశ్నించరా?

మూడురంగుల జెండసాక్షిగ..'సీత'నీతో వుండునెపుడూ
గంజినీళ్లకు,ముతక మెతుకుకు .. చేయూతవై ప్రశ్నించరా?


                

కామెంట్‌లు