చిరుజ్ఞాపకం:- కథానిక;-మమత ఐలహైదరాబాద్9247593432
 నేటి సమాజం ఎవరికి వారే యమునా తీరే నమ్మశక్యం గాని రోజులు మరి స్త్రీలు స్త్రీలను కూడ నమ్మడానికి లేదట
          ఇటువంటివి విన్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిందే అనిపిస్తుంది.
         మనజాగ్రత్త మన మనసులో ఉంచుకొని ఎదుటి వారిని గమనించినప్పుడు తెలుస్తుంది. వాళ్ళు కూడా మనలాగే ఆలోచిస్తారని . మనం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, మనకు మల్లే ఒంటరిగా ప్రయాణం చేసేవారిని గమనిస్తే తెలుస్తుంది. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది సుమా! ఇరువురు ఒకవైపే ప్రయాణించాలి . కానీ ఎడబాటులో ఉన్న జాగ్రత్త చూస్తే అబ్భో! చెప్పనలవి కాదు.చీకటి పడుతున్న సమయాన ఈ జాగ్రత్తల వింతలు మరీ నవ్వు తెప్పిస్తుంటాయి. ఒక రోజు నాకు తారసపడిన సంఘటన. మూడు గంటల ప్రయాణానికి బస్సు కూకెట్టుపాములా వెలుతుంది తోటి ప్రయాణికురాలు కూడా నా వైపే రావాలి. బస్సు దిగేవరకు కూడా అన్ని కబుర్లు చక్కగానే సాగాయి. ఈ బస్సు మనని ఎప్పుడు దించుతుందో ఏమో అనుకున్నాము ఇద్దరమూ నాలుగు గంటలు పట్టింది.చిన్న సిటీ నుండి పెద్ద సిటీ చేరుకున్నాము. అప్పటికే చీకటైంది  మరో బస్సునెక్కాలిఅంటే కొంత దూరం నడవాలి రోడ్డు కూడా క్రాస్ చేయాలి ఇద్దరమూ. ఆ మధ్యలో చూడాలి ఆనందము ఎవరి దారి వాళ్ళకు తెలుసు ,ఎవరి గమ్యము వారికి తెలుసు ఎవ్వరి బస్సు వారికి తెలుసు ఐనా ఏంతో ఎడబాటును ప్రదర్శిస్తున్న తీరు ఆశ్చర్యము గమనించి చూస్తే సంబరము . వెళ్దామని అంటుంది వెనక వెనక నడుస్తోంది. మధ్యలోనే  నాకు కావలసిన బస్సెక్కుతానేమోనని చూస్తుంది అక్కడెక్కుతావా ఇక్కడెక్కుతావా అని అడుగుతుంది. నేను కూడా తన స్టాప్ వద్దనే ఎక్కితే బాగుండు అని ఆశిస్తుంది తన కోసం ఎవరో పికప్ చేసుకోవడానికి వస్తున్నారన్నట్టు ఫోన్ మాట్లాడుతుంది . ఫోన్ రింగైతే వినిపించలేదు. ఆ స్టాప్ వద్దకు వస్తారట అంటుంది. ఐతే ముందు నడుస్తుంది లేకుంటే వెనుక నడుస్తుంది. గ్యాబ్ చాలా మేంటన్ చేస్తుంది కానీ నేను వస్తున్నానా లేదా అని అబ్జర్వు చేస్తోంది. రోడ్డు క్రాస్ చేద్దామా అని అడుగుతుంది. చీకటి కదా ఎవరికివారు అలర్ట్ గా ఉన్నా ఏవో ఆశ్చర్యం కొలిపే జాగ్రత్తలు చూస్తుంటే నవ్వోస్తుంది.స్టాప్ వరకు చేరుకున్నాము కానీ తనకోసం ఎవ్వరూ రాలేదు. నేనడుగుతాననుకుందేమో బహుశా మీ వాళ్ళు వస్తారవుకదా అని లేదా ఇంకేమనుకుందో తెలియదు కానీ చాలా దూరంలో వేరేవాళ్ళతో నిలుచుంది. కొద్ది సేపటికి ఏవో రెండు మూడు బస్సులు వచ్చాయి. అందులో ఓ బస్సెక్కి వెళ్ళిపోయింది.
ఆమెను చూస్తే అర్థమైంది . నేనేనంటే నాకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళే అధికమని .నేనుకూడా నా బస్సు వచ్చాక ఎక్కి నాగమ్యం చేరుకున్నాను.


కామెంట్‌లు