మినీ కథ: తెలివి; -..కనుమ ఎల్లారెడ్డి93915 23027

 రాజరావుకు కొత్తగా కరెంట్ ఆఫీసులో బిల్లులు కట్టించుకునే ఉద్యోగం వచ్చింది.ప్రారంభంలో అందరికీ ఓపికగా సమాధానాలు ఇచ్చేవాడు.కొంతమంది మాకు
ఎక్కువ బిల్లు వచ్చింది.మాకు ఉండేది రెండు బుల్బ్ లు,ఒక ఫ్యాన్,టీవీ ఇవే వీటికే  రెండువేలు బిల్లు వచ్చింది.ఎలా వస్తుంది చెప్పండి అని అడిగేవారు.ముందు ఓపికగా  చెప్పేవాడు.రోజు ఎక్కువ బిల్లులు గురించే పిర్యాదులు వస్తుంటే సమాధానం చెప్పలేక నీరస పడి పోయేవాడు. బిల్లులు కట్టించుకునే దానికన్నా ,వీళ్ళకు సమాధానాలు చెప్పడం తలకు మించిన భారం అయ్యేది.పని ముగించుకుని రాత్రి ఎప్పుడో వచ్చి నిద్రపోయేవాడు.ప్రతి రోజు ఫిర్యాదులు రావడంతో ఓ పరిష్కారం ఆలోచించాడు.ఆలోచన వచ్చిందే తడవుగా ఆ రాత్రి ఇంటికి వెళ్ళే ముందు ఓ బోర్డ్ వేలాడదీశాడు.ఉదయం యధాలాపంగా బిల్లులు కట్టించుకుంటున్నాడు.బిల్లుఎక్కువగా వచ్చిన వాళ్ళు ఆ బోర్డ్ చూసి మిన్న కుండి పోయారు.
ఇద్దరు,ముగ్గురు వ్యక్తులు వాళ్ళల్లోనే మాట్లాడుకుంటున్నారు.మరో వ్యక్తి వచ్చి "నేను సింగల్ రూమ్ లో ఉన్నాను. ఒక బుల్బ్, ఫ్యాన్ తప్పా ఏమి లేవు రెండు వేలు బిల్లు ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. రాజారావు వింటున్నాడే కానీ సమాధానం చెప్పడం లేదు.ఆ వచ్చిన వాళ్ళలో ఒకాయన " ఆ బోర్డ్ చూడు " అన్నాడు.అప్పుడు బోర్డ్ చూసి ఇలా చదువుకున్నాడు ఆ వ్యక్తి.
"నాకు చెవుడు ఉన్నది.వినపడదు. మీ బిల్లులో ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఏ. ఈ(A. E) ఆఫీసులో సంప్రదించవలసింది. అని రాసుంది. అప్పటినుండి బిల్లులలో సమస్యలు ఉన్నవారు రాకపోవడంతో పని తేలిక అయింది.ఎవరితో వాదనలు లేవు.ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు.తెలియక ఎవరైనా  అడిగితే చెవి దగ్గరకు చేయి పెట్టి వినపడదు బోర్డ్ చూడమని సైగ చేసే వాడు.

కామెంట్‌లు