, మాతృ ప్రేమ;-...కనుమ ఎల్లారెడ్డి,93915 23027.

 ఓ లేగ దూడ తల్లి చనిపోయింది.అది అటూఇటూ తిరుగుతూ పాలకు అలమటిస్తూ
ఉండిపోయింది. దాని సమీపంలోనే దారి ప్రక్కన ఓ శునకం తన రెండు పిల్లలకు పాలిస్తోంది.లేగ దూడ చిన్నగా అక్కడకు వచ్చింది.దూడను చూసి శునకం ఏమి అనలేదు.పాపం తల్లి పోయింది అనుకుంది.
దూడ మెల్లగా శునకం పిల్లలు పాలు తాగుతుంటే నాలుక చ్ఛప్పరించి అది కూడా శునకపు పిల్లల మాదిరే పాలు తాగడం మొదలు పెట్టింది. శునకపు పిల్లలు కీసు మని అరుస్తూ పాలు తాగుతుంటే వాతితో పాటే లేగ దూడ కూడా.అయితే తల్లి శునకం ఏమి అనక తన పిల్లల మాదిరే లేగ దూడను ఆదరించింది.ప్రతిరోజు శునకపు పాలు తాగేది దూడ.వాటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది.క్రమంగా వాటి మధ్య మంచి అనురాగం ,స్నేహం ఏర్పడింది.ఎక్కడికి వెళ్ళినా తల్లి శునకం,వాటి పిల్లలు,లేగ దూడ
కలసి వెళుతుండేవి. ఓ రోజు కొంతమంది వ్యక్తులు కుక్కలను పట్టుకుని బోనులోకి వేస్తుండటం చూసింది లేగ దూడ.వెంటనే తల్లి శునకం దగ్గరకు పరుగున వచ్చి " అమ్మ ప్రక్క వీధి లో కుక్కలను పట్టుకుని బోనులో వేస్తున్నారు.అటు వెళ్ళకు, నా చిన్ని తమ్ములను,నిన్ను నేను కపడుకుంటాను పదండి ."అదిగో వాళ్ళు ఇటు వైపే పొంచి, పొంచి వస్తున్నారు " అని చెప్పి లేగ దూడ వాళ్ళని ఓ పొద దగ్గర దాచి పెట్టి అక్కడ పడుకుని నెమరు వేస్తూ ఉంది.వారు అటు వెళ్ళగానే అవి పొద నుంచి బయటకు వచ్చాయి.తల్లి శునకం " నీ మేలు మరువను "
అంటే, " నేనే నీకు ఋణపడివున్నాను.నీ పిల్లల మాదిరే నాకు మాతృప్రేమను పంచావు.నువ్వు ఎప్పటికి నా తల్లివే " అంది కృతఙ్ఞతగా.ఆ పిల్లలు లేగ దూడ చుట్టూ చేరి
కేరింతలు కొడుతూ ఉంటే చూచి ఆనందించింది తల్లి శునకం.

కామెంట్‌లు