ఒకూర్లో ఒకామె వుండేది. ఆమె పెద్ద తిక్కల్ది. తిక్కల్దంటే తెలుసు గదా... లోకజ్ఞానముండదు. మనమొకటి చెప్తే వాళ్ళొకటి చేస్తా వుంటారు. తెలివితేటలు అస్సలుండవు. అంటే పెద్ద అమాయకురాలన్నమాట. సరే ఆమె పెరిగి పెద్దగయింది. పెద్దగయినాక పెండ్లి చేయాల గదా... దాంతో వాళ్ళమ్మానాన్నా ఆమె తిక్కల్దనే సంగతి దాచిపెట్టి ఒకనికి అడిగినంత కట్నమిచ్చి పెండ్లి చేసి కాపురానికి పంపిచ్చినారు.
ఒకరోజు వాడు పెండ్లాన్ని పిల్చి 'ఏమే... నేను చేనుకాడికి పోతా వున్నా... మధ్యాన్నానికి అన్నం చేసుకోని ఆడికే తీసుకోనిరా' అని చెప్పి పోయినాడు. సరేనని ఆమె మొగుడు చెప్పినట్లే మధ్యాన్నానికంతా అన్నం పప్పు చేసుకోని మూటగట్టుకోని... పోయేటప్పుడు తాళమేద్దామని తలుపులు మూయబోయింది. అవి చానా పాతవి. దాంతో ఏసేటప్పుడు కిర్రు... కిర్రు.. మని చప్పుడు చేసినాయి.
ఆమె పెద్ద తిక్కల్దిగదా... దాంతో ఆ చప్పుడు విని ''అరెరే... నేను పోతా వుంటే ఇవి వద్దువద్దని ఏడుస్తున్నట్టున్నాయే...'' అని తలుపుల దగ్గరికి పోయి '' లేదులేమ్మా... ఇప్పుడే అట్లా పోయి ఇట్లా వస్తా... ఏడ్చమాకండి'' అని చెప్పి మళ్ళా మూయబోయింది. మళ్ళా అవి కిర్రు.. కిర్రు... మన్నాయి. దాంతో ఆమె ''సరే... సరే... ఏడ్చొద్దండి. మిమ్మల్ని గూడా తీసుకోనిపోతాలే నాయెంట'' అని గునపం తీసుకోనొచ్చి తలుపులు పెరికి దాండ్లను గూడా నెత్తిన పెట్టుకోని చేనుకు బైలుదేరింది.
నెత్తిన తలుపులు పెట్టుకోని వస్తా వున్న పెండ్లాన్ని చూసి వాడదిరిపడి ''ఏందే... ఇట్లా తలుపులు తీసుకోనొస్తా వున్నావు'' అన్నాడు ఆచ్చర్యంగా. దానికామె '' ఏం చేయమంటావ్... వస్తా వుంటే ఇవి కిర్రు.. కిర్రు... మని ఏడుస్తా... మేమొస్తాం... మేమొస్తాం... అంటా వుంటే పాపమని పెరుక్కోనొచ్చినా'' అని చెప్పింది. వాడు లబలబలబ నోరు కొట్టుకుంటూ '' తలుపుల్లేకుండా ఇంటినట్లా వదిలేసి వస్తే ఇంగేమన్నా వుందా... ఎవరన్నా చూసినారంటే మట్టసంగా ఇంట్లో వున్నవన్నీ నున్నగా నూక్కపోతారు. నువ్వెంత తిక్కల్దానిలా వున్నావే'' అంటూ ఆ తలుపులు ఎత్తుకోని ఇంటికి గబగబా వురికినాడు.
ఆమె ఆన్నే కూచోని అటూ ఇటూ చూడసాగింది. అంతలో ఆడ ఒక ఎద్దు వుచ్చ పోయసాగింది. అది చూసి ఆమె ''అరెరెరే... దీనికి బొక్క పన్నట్టుంది. అందుకే నీళ్ళు సర్రున కారిపోతా వున్నాయి. పాపం'' అనుకోని గబగబా కొత్తచీర సగం చింపి గట్టిగా కట్టు కట్టింది.
కాసేపటికి వాడు ఇంటి దగ్గర మళ్ళా తలుపులు బిగించి తాళమేసుకోని చేనుకాడికి వచ్చినాడు. వచ్చి చూస్తే పెండ్లాం యాడా కనబళ్ళేదు. యాడికి పోయిందబ్బా అని చుట్టూ చూస్తా వుంటే బండల చాటున దాచిపెట్టుకోని కనబడింది. ''ఏందే ... ఆడున్నావ్'' అనడిగినాడు. దానికామె '' మన ఎద్దుకు పెద్ద బొక్క పడింది. అందుకే సర్రున నీళ్ళు కారిపోతా వుంటే చీర చించి కట్టు కట్టినా... ఒంటి మీద సగం చీరనే వుంది. ఇంటికి పోయి వేరే చీర తేపో'' అనింది. వాడు లబలబలబ నోరు కొట్టుకుంటా '' నువ్వేం తిక్కల్దానివే... ఎద్దేంది... బొక్క పడ్డమేంది... అనవసరంగా బంగారం లాంటి కొత్తచీర చినగ్గొట్టినావ్ గదా'' అని వురుక్కుంటా మళ్ళీ ఇంటికి పోయి చీర తీసుకోనొచ్చి ఆమెకిచ్చినాడు. ఆమె దాన్ని కట్టుకోని ఇంటికి పోయింది.
ఇంటి దగ్గర కూచోని వచ్చే పోయేవాళ్ళని చూస్తా వుంటే ఒకడు ''తేనెమ్మా ... తేనె'' అని అమ్ముకుంటా కనబన్నాడు. ఆమెకు నోట్లో నీళ్ళూరి వాన్ని పిల్చి ''అనా... అనా.. కొంచం తేనె ఇయ్యి'' అనడిగింది. దానికి వాడు ''వూరికే ఎవరిస్తారమ్మా... ఏమన్నా ఇస్తే ఇస్తా'' అన్నాడు. ఆమె పెద్ద తిక్కల్ది గదా... వెంటనే ఇంటి ముందు కట్టేసిన బరగొడ్డును చూపించి ''అదిగో... అది తీసుకోని పొయ్యి'' అనింది.
వాడు అటూ ఇటూ చూసి ఇదేదో పెద్ద తిక్కల్దాని లెక్కుందనుకుంటా ''సరే... దేంట్లో పోయాల'' అన్నాడు. ఆమె నోరు తెరచి ''నోట్లో పొయ్యి'' అనింది. వాడు కొంచెం నోట్లో పోసినాడు. దాన్ని తాగి ''నా మొగునికి గూడా కొంచం పోయి... వచ్చినాక ఇస్తా'' అని మరికొంచం నోట్లో పోపిచ్చుకోనింది. వాడు సంబరంగా బరగొడ్డును విప్పుకోని ఆన్నించి బెరబెరా తోలుకోని ఎళ్ళిపోయినాడు.
ఆమె నోట్లో తేనె పోసుకోని దాన్ని మింగకుండా అట్లే పెట్టుకోని మొగుని కోసం ఎదురు చూడసాగింది. వాడు సాయంత్రందాకా చేన్లో పని చేసీ... చేసీ... అలసిపోయి చీకటి పడే ముందు ఇంటికొచ్చినాడు. వచ్చి చూస్తే ఇంగేముంది ఇంటి ముందు బరగొడ్డు కనబల్లేదు.
' ఏమే... బరగొడ్డు కనబడ్డం లేదు... యాడికి పోయిందే'' అనడిగితే ఆమె నోటి నిండా తేనుంది గదా... దాంతో వూ... వూ... అంటాదే గాని ఒక్కమాటా మాట్లాడదు.
దాంతో వాడు '' నేనింత నెత్తీనోరు కొట్టుకోని అడుగుతా వుంటే... వూవూ అంటావేగానీ... ఒక్కమాటా మాట్లాడవే... ఎంత పొగరు నీకు... వుండు నీ పని చెబ్తా'' అంటా కోపంగా ఆమెను వంగబెట్టి దభీదభీమని వీపు మీద నాలుగు గుద్దులు గుద్దినాడు. అంతే... ఆ దెబ్బలకు ఆమె నోట్లో వున్న తేనెను గుటుక్కున మింగేసింది. మింగేసి ''నీ కోసమని మధ్యాన్నం నుండీ మింగకుండా అట్లే పెట్టుకోని చూస్తా వుంటే మెచ్చుకోవలసింది పోయి... నన్నే తంతావా... వుండు నీ పని చెబ్తా'' అని వురుక్కుంటా లోపలికి పోయి రోకలిబండ తీసుకోనొచ్చి మొగున్ని దభీదభీమని నాలుగు పెరికింది.
దాన్తో వాడు ''థూ... థూ... ఈ తిక్కదాంతో ఈ ఇంట్లో వుండడం కన్నా పోయి ఆ అడవిలో వుండడం మేలు'' అనుకోని వచ్చినోడు వచ్చినట్లే వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు.
వాడు అడవిలో పోతాపోతా వుంటే కాసేపటికి బాగా చీకటి పడింది. చీకట్లో తిరగడం మంచిది కాదుగదా... దాంతో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఒకచోట ఒక పాడుబన్న గుడి కనబడింది. ''ఈ రాత్రికి ఈడ పండుకోని రేప్పొద్దున్నే పోదాం'' అనుకోని లోపలికి పోయి పండుకున్నాడు.
అర్ధరాత్రి దాట్నాక నిద్రలో ఏవో చప్పుళ్ళు వినబడి లేచినాడు. ఏందబ్బా ఈ రాత్రిపూట అని మట్టసంగా చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటా బైటకొచ్చి చూస్తే... కొంతమంది దొంగలు అరుచుకుంటా, మాట్లాడుకుంటా అన్నం తింటా కనబన్నారు. వాళ్ళ పక్కనే కొన్ని గాడిదల మీద ఎక్కడెక్కడో దోచుకొచ్చిన బంగారమంతా వుంది. వాడు లోపల్నే దాచిపెట్టుకోని అట్లాగే చూడసాగినాడు. కాసేపటికి వాళ్ళు బాగా తిని పండుకోని నిద్రపోయినారు.
వాళ్ళట్లా నిద్రపోవడం ఆలస్యం వీడు నెమ్మదిగా బైటకొచ్చి చప్పుడు కాకుండా గాడిదలన్నిట్నీ తోలుకోని ఇంటికొచ్చినాడు. వచ్చి, దాండ్లమీదున్న బంగారమంతా ఇంట్లో దాచిపెట్టి గాడిదలను వూరి బైటకి తరిమేసి ఏమీ ఎరుగని నంగనాచిలెక్క మట్టసంగా వుండిపోయినాడు.
దొంగలు పొద్దున్నే లేసి చూస్తే ఇంగేముంది... గాడిదలూ లేవు... బంగారమూ లేదు... దాంతో వాళ్ళందరూ ఆ అడవి చుట్టూ వున్న ఒక్కొక్క వూరూ పోయి ఎవరింట్లోనన్నా గాడిదలున్నాయేమోనని వెదుకుతా... వెదుకుతా... వీళ్ళుండే వూరికి వచ్చినారు. వాళ్ళు వూర్లో ఒకొక్క ఇండ్లే వెదుక్కుంటా ... వెదుక్కుంటా... వీళ్ళింటి ముందుకి వచ్చినారు.
ఈమె ఇంటి ముందే కూచోని వచ్చేపోయే జనాలనంతా చూస్తా వుంటాది గదా... దాంతో వాళ్ళు కనబడితే పిల్చి ''ఏందన్నా... ఏం కావాల... అట్లా వెదుకుతా వున్నారు.... అప్పట్నుంచీ'' అనడిగింది. దానికి వాళ్ళు ''ఏమీ లేదమ్మా... నిన్న రాత్రి మా గాడిదలు పోగొట్టుకోని పోయినాయి. ఎవరింట్లోనన్నా వున్నాయేమోనని వెదుకుతా వున్నాం'' అన్నారు.
దానికామె ''ఓరినీ... నా మొగుడే రాత్రి గాడిదల్ని ఎక్కన్నుంచో తోలుకోనొచ్చి... ఇంట్లో పెద్ద పెద్ద మూటలు దాచిపెట్టి... మళ్ళా ఎందుకో దాండ్లను తన్ని తరిమేసినాడు. గాడిదలు లేవు గానీ మూటలున్నాయి కావాల్నా'' అనడిగింది. వెంటనే వాళ్ళు లోపలికొచ్చి ఆమె మొగున్ని మెత్తగా తన్ని తిరిగి బంగారమంతా తీసుకోని పోయినారు.
వాడు దెబ్బలకు ఏడుస్తా '' వాళ్ళ మానాన వాళ్ళు పోతా వుంటే పిల్చి మరీ తన్నిస్తావా... నీలాంటి దాన్తో కాపురం చేయడం నావల్ల గాదు'' అంటా వాడు ఇల్లొదిలి సన్యాసుల్లో కలిసిపోయాడు.
***********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి