👌క్రొత్త సంక్రాంతి, భువి
చిగురింప చేయాలి!
కొంగ్రొత్త ఆశలను!
శ్రీరస్తు! శుభమస్తు! (1)
👌ఆయు రారోగ్యములు
శాంతి దాంతుల నొసగు!
సకల మానవాళికి!
శ్రీరస్తు! శుభమస్తు! (2)
( శివమస్తు పదాలు., శంకర ప్రియ., )
👌సౌరమానం ప్రకారం, ప్రత్యక్ష పరమేశ్వరుడయిన, సూర్య భగవానుడు.. మకరరాశిలో ప్రవేశించు సుదినము.. మకర సంక్రాంతి, పర్వదినం! దీనినే "క్రొత్త సంక్రాంతి" అని; "పెద్ద పండుగ" అని, వ్యవహరిస్తాము! ఈ పర్వదినం.. అందరిలో నూతనోత్తేజమును కలిగిస్తుంది. సరిక్రొత్త ఆశలను చిగురింప చేస్తుoది!
👌 "సంక్రాంతి" గురించి, కొన్ని నిర్వచనములు పేర్కొన్నారు; మధుర కవి, డాక్టర్. కరుణశ్రీ గారు. వాటిని పరిశీలించండి!
👌రసవంతమగు కావ్య రచనకు రచయితల్,
స్వాగతించిన, అది "సాహిత్య సంక్రాంతి"!
👌యువశక్తి యుగశక్తి నవనవోన్మేషమై
పొంగులెత్తిన, అది "పొంగళ్ల సంక్రాంతి"!
👌కామ పిశాచినిన్ నరికి ముక్కలు చేసి,
అగ్ని కాహుతి చేయ, అది "భోగి సంక్రాంతి"!
👌శిష్యరత్నాలు దేశిక సువర్ణాలతో
అన్యోన్య మున్న, అది "ఆదర్శ సంక్రాంతి"
(ఆనంద లహరి., డా. కరుణశ్రీ.,)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి