గీతా వాణి: "యోగ క్షేమం వహామ్యహం!'"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌యోగ క్షేమములను
   
      వహియించు నీశ్వరుడు!
      సకల ప్రాణి కోటికి!
           ఆత్మ బంధువు లార!
           ( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌భక్త మహాశయు లందరు త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని సేవించాలి. అనన్య భక్తితో.. సాధకుల చిత్తములో స్థిరముగా నెలకొన్న నామమే.. "తారక నామ మవుతుంది"!
👌"ఓం నమః శివాయ", ప్రణవ సహిత శివపంచాక్షరి; "ఓం నమో నారాయణాయ", నారాయణ అష్టాక్షరి...  మున్నగు తారక మహా మంత్రములను, నిత్యము జపించాలి!
👌 పరమేశ్వరుడ నైన నన్ను; ఎవరు, ఇతరములైన భావములు లేనివారై: నిరంతరము తత్త్వ చింతన చేయుచు; ధ్యానించు చున్నారో; నిష్కామ భావంతో సేవించు చున్నారో; ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి యున్నారో; అటువంటి వారి యొక్క 'యోగ క్షేమములను' నేనే అనుగ్రహించు చున్నాను!" అని, పరమేశ్వరుడు; భక్త మహాశయులకు అభయ ప్రదానము చేయుచున్నాడు.
🚩"అనన్నా శ్చింత యంతో మాం!.." అని, ( భగవద్గీత (9) రాజవిద్యా రాజగుహ్య యోగం, 22వ. శ్లోక రత్నము నందు ) గీతాచార్యుడు పేర్కొను చున్నారు.
  🙏గీతా సందేశం
       ( తేట గీతి )
       ఎవరు నితరములను వీడి, ఏక దృష్టి
       పరగ కొలుతురు స్వ స్వరూపముగ దలచి;
        నిరత విజ్ఞాన సంపన్న నిష్ఠ గలిగి
        యెసగు, వారి యోగ క్షేమ మే వహింతు!!
( 'కవి శేఖర', శ్రీ అబ్బరాజు హనుమంత రాయ శర్మ. )

కామెంట్‌లు