👌జఠరాగ్ని రూపునిగ
పరమేశు డున్నాడు!
ప్రాణులందరి యందు!
ఆత్మ బంధువు లార!
( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌పరమేశ్వరుడు.. సమస్త జీవరాశి హృదయాలలో "వైశ్వానరాగ్ని"( జఠరాగ్ని ) రూపములో నున్నాడు. జీవులకు.. ఉష్ణశక్తిని చేకూర్చుచు; వారు భుజించిన ఆహారమును జీర్ణము చేయుచున్నాడు.
👌"సాధకులార! నేను వైశ్వానరాగ్ని రూపునిగా, సకల ప్రాణికోటి దేహములను ఆశ్రయించుకొని యున్నాను! అట్లే, ప్రాణాపాన వాయువులతో కూడి; నాలుగు విధములైన ఆహారమును పచనము చేస్తున్నాను!" అని, పరమేశ్వరుడు; సకల మానవాళికి దివ్య సందేశ మిచ్చారు.
🚩"అహం వైశ్వానరో భూత్వా!.." అని, ( భగవద్గీత (15) పురుషోత్తమ ప్రాప్తి యోగము, 14వ. శ్లోక రత్నము నందు ) గీతాచార్యుడు పేర్కొను చున్నారు.
🙏గీతా సందేశం
( తేట గీతి )
అఖిల జీవ శరీరంబు లాశ్రయించి
నేను, జఠరాగ్ని రూపుoడ నై, నిరతము
ప్రాణము నపానమును గూడి,
పరగ నలు వి
ధంబులగు అన్నముల పచనంబు జేతు!!
( 'కవి శేఖర', శ్రీ అబ్బరాజు హనుమంత రాయ శర్మ. )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి