" ఆ " అక్షర గేయం;-మచ్చ అనురాధసిద్దిపేట9948653223
ఆవును పూజించుము
ఆవు పాలు  శ్రేష్ఠము
ఆవు మనకు దైవము
ఆత్మీయత పంచుము

ఆటలెన్నో  ఆడెదము
ఆరోగ్యంగా ఉండెదము
ఆనందంగా గడిపెదము
ఆప్యాయత పంచెదము

ఆవేశము వీడెదము
ఆలోచనలు పెంచెదము
ఆశీస్సులు పొందెదము
ఆసరాగా  నిలిచెదము

ఆచార్యుల  ఆజ్ఞలను
ఆచరణలో పెట్టెదము
ఆంధ్రము తప్పక నేర్చెదము
ఆదర్శంగా నిలిచెదము .కామెంట్‌లు
Unknown చెప్పారు…
గేయం చాలా బాగుంది
Unknown చెప్పారు…
మీ గేయాలు చాలా బాగున్నాయి మేడం