వీధి బాలలు;--సంతోషీ లక్ష్మీ సన్నిధి;--కలంస్నేహం

 చక్కటి చిరునవ్వులతో, 
చదువులమ్మ ఒడిలో ఆడుకోవలసిన బాల్యం,
చలిలో చిల్లుల దుప్పటిలో నుంచి కొత్త రేపటి కోసం 
ఎదురుచూస్తున్నయి,
చిగురుతొడుగుతున్న చిన్న మొక్కలు,
చీదరించే వారే కానీ అక్కున ఆదరించే వారు కరువైనారు,
చేయిందిచీ ఆకలి తీర్చే వారే లేరు,
ఉండేందుకు చోటు లేక 
వీధుల్లో,
చెత్తకుప్పలో తల దాచుకుంటున్నారు,
పేగు తెలియిక,ప్రేమ బంధం లేక ,
చీడపురుగులున్న సమాజపు వలలో
చిక్కుకున్న చేపలు,
చొరవ తీసుకునేవారు లేక,
చోరులుగా చలామణి అవుతున్నారు కొందరు,
చేతకాక ఛీత్కారాలకు గురౌతున్నారు,
వీరి జీవితాలలో
చైతన్యపు కిరణాల కాంత ప్రసరించాలనీ.....
చిరుజ్యోతి వెలుగులు వారి జీవితాల్లో నిండాలనీ ....
కామెంట్‌లు