డా.వాసరవేణి పర్శరాములుకు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం

 బాలసాహిత్య రచయిత&పరిశోధకులు డాక్టర్ వాసరవేణి పర్శరాములుకు బాలసాహిత్య రంగంలో కృషికిగాను తెలుగు యూనివర్సిటీ  కీర్తి పురస్కారం ను ప్రకటించడంపట్ల తెలంగాణ వివేక రచయితల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
          ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో తెవిరసం జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్ గారు మాట్లాడుతూ 12 ఏండ్ల బాల్యంనుంచే పర్శరాములు బాలసాహిత్యం రాస్తున్నారనీ " చుక్ చుక్ రైలు", చల్ చల్ గుర్రం, చిర్రగోనె,గొర్రెపిల్ల, చైతన్యమూర్తి, మట్టిలో మాణిక్యం,తెలంగాణ వ్యవహారిక భాషా పదాలు, మొదలగునవి పుస్తకాలు రాయడంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  "ఈ దశాబ్ది బాలసాహిత్యం (2001-2010)- ఒక పరిశీలన "అను అంశంపై పరిశోధన చేసి  తెలంగాణ రాష్ట్రంలో తొలి వ్యక్తిగా బాలసాహిత్యంలో డాక్టరేట్ పొందారన్నారన్నారు. నిరంతరం బాలలకోసం రచనలు చేస్తూ బాలల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనీ బాలసాహిత్య సేవను గుర్తించి ఎ.పి,తెలంగాణ రెండు రాష్ట్రాలస్థాయిలో తెలంగాణకుచెందిన పర్శరాములుకు అందించడం గర్వకారణమన్నారు. కాగా ఈనెల 11న హైదరాబాద్లో రాష్ట్ర మానవహక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య,తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తంగెడ కిషన్ రావు చేతులమీదుగా పురస్కారం అందుకోనున్నారనీ రమేష్ గారు తెలిపారు.
     పర్షరాములుకు పురస్కారం రావడంపట్ల డా.జనపాల శంకరయ్య, పి.అశోక్, పెరుమాండ్ల రాజయ్య,గుండెల్లి నీలకంఠం,బారా ధన్ రాజ్, గజభీంకార్ అజయ్,వాసరవేణి దేవరాజు,జి.తిరుపతి,యాసరేణి రాజు,ఇమ్మడోజు మహేందర్,ఇ.సౌమ్య,ఆర.వెంకన్న, తదితరులు హర్షం వ్యక్తంచేశారు.
కామెంట్‌లు