నీలాకాశం నీడల్లో
ముగ్ధమోహన సుందర దృశ్యం
కమనీయ పుష్పాల అద్భుత రూపలావణ్య సుందర సుమధుర మధుర సృష్టి తరంగం...
మదిని రంజింప చేసే
సున్నిత కుసుమాల
వీక్షణం
సంతోషాలలో ఎదకొలను
సవ్వడిని చేసే
అనిర్వచనీయమైన అనుభూతి తరంగం
విరుల సోయగాలు
చూస్తున్న మది చేసే నాట్యం..!
ఆనందం పంచడమే ధ్యేయంగా
త్యాగమే తనలో నింపుకుని
నిరంతరం నిస్వార్థ సేవను
పోత పోసుకున్న
సహజ సౌందర్య పువ్వులు
అందరి హృదయాలలో నిలిచిన అద్బుతాల మకరంద సుమగీతం...!
నైజంతో
ఆదర్శ ఆశయ జన్మలో
తరించే నిర్మల శోభితం
జీవించే కొద్దికాలమైనా
నిస్వార్ధ పుష్పం
అవనిలో జనియించిన
విరుల గుచ్చం
ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి