యువత బాలల‌గేయం; సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లా.
తాత ముత్తాతల కాలం కాదిది
యువత జవసత్వాల
జాతి కథ ఇది !?

యుద్ధం చేయాల్సింది 
వృద్ధులు పెద్దలు కాదు
యుద్ధం చేయాల్సింది
పేదలు ధనికులు కాదు
యుద్ధం చేయాల్సింది
యువతీ యువకులు !!!?

రాజకీయాల్లోకి రావాల్సింది
అసమర్థులు స్వార్థపరులు కాదు
రాజకీయాల్లోకి రావాల్సింది
సమర్థులు నిస్వార్ధ యువకులు

యువత పెద్ద పెద్ద చదువులు 
చదవాల్సిందే
పెద్ద పెద్ద ఉద్యోగాలు
చేయాల్సిందే !!?
కాలంతో పాటు దేశం మారాల్సిందే
యువతీ యువకులు మారాల్సిందే!!?

మనకు కావాల్సింది
సంపన్న దేశం కాదు
సైన్సు దేశం సంతోషం !!?

సాటి వారికి సహాయం చేయకు కానీ
నీ జాతి తో నిజాయితీగా బ్రతుకు
స్వార్థం వీడకు అర్థం వీడకు కానీ
అందరినీ అర్థం చేసుకుని బ్రతుకు !!?

బ్రతుక్కీ భద్రత కన్నా
ఒక అర్థం ఉండాలి!!?
జాతీయ జెండా
నిన్ను భద్రంగా కాపాడుతుంది !?

26th Januaryనీ పురస్కరించుకుని
Sunita Pratap teacher PS Nandi waddeman Nagarkurnool dist 🙏🙏

కామెంట్‌లు
Unknown చెప్పారు…
అమ్మా...
మీ కవిత యువతకు ఒక సందేశం,
ఒక మార్గదర్శనం..!
Ramakrishna Aturu చెప్పారు…
అమ్మా.. మీ కవిత యువతకు సందేశం
ఒక మార్గదర్శనం.