నీ వచ్చే క్షణాలకై;-సంధ్యా కుమారి ఎరుసు;-కలం స్నేహం

ఏ క్షణం నిన్ను చూసానో
మరు క్షణమే నీ దాననైనాను
తనువంతా నీ వశమవ్వాలని
కాలమంతా నీ ధ్యాసలోనే 
గడిపేస్తున్నాను,
హృదిలో నీ రూపాన్నే దాచా 
నీ ప్రేమకై ఎదురు చూస్తున్నా హృదయాంతరగమంతా
ఆవాసమై వున్నావు

చిరు జల్లులు కురిసే వేళ
మరు మల్లెలు మురిపిస్తున్నాయి
చిక్కని చక్కని వెన్నెలలో 
నీ తలంపుల 
జడిలో తడిసి పోతున్నా

నీ అనురాగం నన్ను
అల్లుకుపోగా పరవశాల
తోటలో నన్ను నేను మరిచిపోగా 
క్షణాలెన్నో కలవరింతలే 
నీ వస్తే నీ కౌగిలిలో కరిగిపోవాలని
మన ఇద్దరి సంగమం కలిసినంతనే
అనురాగబంధమై 
ఆనంద తీరాలలో
సాగిపోదామా

కలలెన్నో కరిగి
కళ్ళ ముందే నిలిచి
కళ్ళు చెప్పే చిలిపి
భావాలన్నీ మూటగట్టి
నీవొచ్చే క్షణాలకై 
ఎదురుచూస్తున్నా

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మంచి భావుకత్వమైన కవనం....ప్రేమ మయమైన స్వరం...బాగుంది మేడం పోయెమ్.