సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
  స్వేచ్ఛ-స్వాతంత్య్రం 
******
వ్యక్తి తనకు తాను ఎలా గడపాలని అనుకుంటాడో అలా ఉండేందుకు స్వంతంగా నిర్ణయాలు తీసుకుని తదనుగుణంగా గడపగలగడమే స్వేచ్ఛ.
ఏది జరిగినా ఆ నిర్ణయాల ఫలితాలకు స్వేచ్ఛ కోరుకున్న వ్యక్తే బాధ్యత,జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది.
అందుకే కొందరికి స్వేచ్ఛ అంటే  భయం.
ఇతరులకు ఇబ్బంది కలుగకుండా హాయిగా, ఆనందంగా గడపడానికి లభించిన హక్కునే స్వాతంత్ర్యం అంటారు.
బాధ్యతలు,హక్కులతో మిళితమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వ్యక్తిగతం కాకుండా అందరికీ వర్తిస్తాయి.
మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ ప్రభుత్వంతో  ఎందరో దేశభక్తులు ,స్వాతంత్రోద్యమ నాయకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, వీరోచితంగా పోరాడటం వల్లనే  మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సాధించుకున్నాం
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏
 


కామెంట్‌లు