శ్రీ పాండురంగ భజన కీర్తనలు పుస్తకావిష్కరణ...;- వెంకట్ మొలక ప్రతినిధి వికారాబాద్:

 పర్యాద నర్సయ్య పంతులు ఆయుర్వేద వైద్య సేవలు మరువలేనివి....
=====================================================
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి...
===================================================
పర్యాద నర్సయ్య ఊరూరా తిరుగుతూ సామాజిక భద్రతగా తన వంతు ఆయుర్వేద వైద్య సేవలు అందించారని కవి రచయిత ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో పాండురంగ స్వామి దేవాలయంలో నర్సయ్య పంతులు రాసిన పాడిన భజన కీర్తనలను ఆయన కూతురు పద్య గేయ రచయిత డాక్టర్ సరళ శ్రీ పాండురంగ భజన కీర్తనల రూపంలో పుస్తకాన్ని పలువురు కవుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు రచయితలు కవులు మాట్లాడుతూ... ధర్మిక. సంస్కృతి. సామాజిక భక్తి. రసభరితమైన గేయాలు పుస్తకంలో పొందు పరిచినట్లు కవి రచయిత సరళ వెల్లడించారు. సంస్కృతి. తెలుగు. కన్నడ. ఉర్దూ భాషలో విద్యను అభ్యసించి బడుగు నడిపించారని తెలిపారు. పుస్తకాన్ని పాండురంగ స్వామికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిషన్ రావు. మాజీ ఎంపిటిసి పర్యాద రమేష్ కుమార్. కర్ణాటక బళ్ళారి తాలూకా బిజెపి కార్యదర్శి వెంకటేష్. రచయితలు సుభాన్ రెడ్డి. రాంరెడ్డి. పర్యాద కుటుంబ సభ్యులు రవికాంత్ ఉపేందర్. గిరిధర్. భజన మండలి సభ్యులు డివై.నర్సాంలు. ఆనంద చారి. శేఖర్. కిరణ్.  వీరన్న. మాణిక్యం. రవిశంకర్. సిహెచ్ శ్రీనివాస్. సిహెచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
shivakumar singh చెప్పారు…
Great spirtual contribution....Hearty congratulations.....
Regards Dr P Shivakumar singh Asst Prof Department of Botany Palamuru University
shivakumar singh చెప్పారు…
Great spiritual contribution...Hearty congratulations madam ji....regards Dr P Shivakumar singh Assistant Professor of Botany Palamuru University