ఆశ్రయ మిచ్చిన చెట్టు నీడలో
అందమైన గూడు కట్టుకునే...
పిట్టా...ఈ మనిషికి గురువే !
అభయహస్తం తో...
స్నేహహస్తాన్నందిస్తూ...ప్రాణికోటితో చెలిమిచేసే చెట్టును...
ఆ స్నేహం విలువ తెలుసుకోక నరుక్కున్నాం... !
అన్నివిధాలా రక్షణ కల్పించే...
అందమైన గూడును కట్టుకునే
.విద్య తనకెవరు నేర్పారు !?
తనప్రయత్నఫలితమే గా... !!
కష్టించి చీమలు పెట్టుకున్న పుట్టల్లో... తేరగా దూరి కూచునే పాముల్లాటోల్లం !
వర్షాన్ని.,తన్మూలంగా అన్నాన్ని
ప్రాణాన్నే దానం చేసే తరువుని
హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ తనగూడు తను కట్టుకుని, తనతిండి తనే సంపాదించుకుని తనబ్రతుకేదో
తనుబ్రతికే పక్షికి గూటినీ, కూటి నీ .... దూరంచేసేస్తూ
నీ సెల్ సరదాలకు టవర్ల తో
నీ స్వార్ధానికి... నీ సుఖానికీ
చెట్టునీ - పిట్టనీ బలిచేసి...
చివరికి... నీ ఈ దుశ్చర్యలకు నువ్వే... బలైపోకు !!
*******
..... కోరాడ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి