పేదింటి పిల్లలకు ఆన్ లైన్ కష్టాలు....; ఫోటోలు : శ్రీరాముల శ్రీధర్




 అక్క ఆన్ లైన్ క్లాసులు కోసం తమ్ముడి ఆరాటం. ..                                       కరోనా దెబ్బతో మరో మారు ప్రత్యక్ష బోధనకు ఫుల్ స్టాప్ పడి ఆన్ లైన్ పాఠాలు మళ్ళీ మొదలయ్యాయి...సోమవారం నుంచి ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది...ఒకప్పుడు పేదల ఇళ్లల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కనిపించేది కాదు . మరి కొంత మంది ఇళ్లల్లో ఒకటే ఫోన్ ఉండేది...కానీ ఆన్లైన్లో బోధనలతో ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అన్ని మొబైల్ ఫోన్లు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం వచ్చింది..ఆండ్రాయిడ్ ఫోన్ లేని పేద పిల్లలు పాఠాలు వినాలంటే ఎన్ని ఇబ్బందులో ......ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది అక్క తమ్ముడు హస్మత్ పేట లో ఉంటారు...తల్లి డ్యూటీలో భాగంగా బోయిన్ పల్లికి ఉదయమే వెళ్లి పోయింది...సోమవారం నుంచి ఆన్ లైన్ పాఠాలు మొదలవుతున్నాయి..ఎలా ఉండే ఒక్క ఫోన్ అమ్మ దగ్గర ఉండిపోయింది...తమ్ముడు అక్కకు ఆన్ లైన్ పాఠాలు మిస్ కావద్దని అనుకున్నాడు..అమ్మ దగ్గరకు అక్కను తాను తీసుకుని వెళ్లాలని వెంటనే తన పాత సైకిల్ బయటకు తీసాడు...దానికి ఒకవైపు హ్యాండీల్ మాత్రమే ఉంది..అయిన అదే మొండి హ్యాండీల్ సైకిల్ పై అక్కను కూర్చోబెట్టుకుని 2 కిలో మీటర్ల దూరంలో బోయిన్ పల్లిలో అమ్మ పనిచేస్తున్న క్లినిక్ దగ్గరకు వచ్చారు...ఆన్ లైన్ తరగతులు అప్పటికే మొదలయ్యాయి...అమ్మ దగ్గర ఫోన్ తీసుకున్న ఆ చిన్నారి పాఠాల్లో మునిగిపోయింది...హమ్మయ్య అక్కకు పాఠాలు మిస్ కాలేదు ఆ తమ్ముడి కళ్ళలో ఆనందం...ఒకింత గర్వం...ఇదంతా మా వార్త ఫోటో గ్రాఫర్ వారి ఇంటి నుంచి గమనిస్తూ వారికి తెలియకుండానే ఫోటోలు తీసి ఆన్ లైన్ తరగతులతో పేదలు పడుతున్న ఇబ్బందులు     బయటకు తెచ్చారు...
కామెంట్‌లు